Breaking
Tue. Nov 18th, 2025

Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన అదానీ

Asia’s Richest Man Adani
Asia’s Richest Man Adani

• ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా రికార్డు
• ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు 5500 కోట్ల డాల‌ర్లు ఆర్జించిన అదానీ

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Asia’s Richest Man Adani: ఆసియా అపర కుబేరుడిగా పేరొందిన ముకేశ్‌ అంబానీని తాజాగా గౌతమ్‌ అదానీ వెన‌క్కి నెట్టారు. నిత్యం వేయి కోట్ల సంప‌ద‌ను ఆర్జిస్తూ ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ నిలిచార‌ని బ్లూమ్‌బ‌ర్గ్ తాజా నివేదిక పేర్కొంది. గత ఏడాది కాలంలోనే అదానీ సంపద 55 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4.12 లక్షల కోట్లు) పెరగడమే ఇందుకు కారణ‌మ‌ని ఈ నివేదిక పేర్కొంది. ఇదే స‌మ‌యంలో ముకేశ్‌ అంబానీ నికర సంపద విలువ 14.3 బిలియన్‌ డాలర్ల (రూ.1.07 లక్షల కోట్లకుపైగా) మేర పెరిగింది.

ఇదిలావుండ‌గా, అదానీ గ్రూప్‌ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఇదే స‌మ‌యంలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.14.91 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దేశంలో అత్యంత విలువైన కంపెనీగా ఆర్ ఐఎల్ నిలిచింది. కానీ ఆర్‌ఐఎల్‌లో ముకేశ్‌కు ఉన్న వాటాతో పోలిస్తే అదానీకి తన గ్రూప్‌ కంపెనీల్లో ప్రమోటరు వాటా అధికంగా ఉండటం గ‌మనార్హం. దీంతో అంబానీని వెన‌క్కి నెట్టి అదానీ అత్యంత ధ‌న‌వంతుడ‌య్యాడు.

Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..

Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’

రైల్వే ట్రాక్ ప‌క్క‌నే వీడియో కోసం.. కానీ అంత‌లోనే..

తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..

కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని

చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Related Post