మీరు స్వర్గంలో ఉన్నారు.. నేను హైదరాబాద్ లో ఉన్నా.. అదే తేడా: రామ్ గోపాల్ వర్మ

ramgopal varma
ramgopal varma

దర్వాజ-సినిమా
Ramgopal Varma:ప్రపంచాన్నందరూ ఒకేలా చూస్తే ఇది లోకమేలా అవుతుంది.. అందుకే అందరూ ఒకలా ఉంటే.. నేను మాత్రం చాలా డిఫరెంట్ పర్సన్ అని ఎప్పటికప్పుడు రామ్ గోపాల్ వర్మ నిరూపించుకుంటూనే ఉంటారు. పక్కోల్ల ఫీలింగ్స్ తో నాకు సంబంధం లేదు.. నేను అనుకున్నదే చెప్తాను.. చేస్తాను అని రామ్ గోపాల్ వర్మ నిక్కచ్చిగా చెప్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో భాధలనేవే లేవని.. అంతెందుకు చావును కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఈయన చెప్తారు. ఈయన మాటలు, చేష్టలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. కొందరు ఈయనను తెలివైనోడు అంటే మరికొందరేమో.. తెలివితక్కువోడు.. తిక్కలోడు అని రకరకాల కామెంట్లు చేస్తుంటారు.

sirivennela-seetharama-shastri మీరు స్వర్గంలో ఉన్నారు.. నేను హైదరాబాద్ లో ఉన్నా.. అదే తేడా: రామ్ గోపాల్ వర్మ

ఇక ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మరణంపై వర్మ తనదైన శైలిలో స్పందించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు. ట్విట్టర్ వేధికగా ప్యాడ్ కాస్ట్ రూపంలో ఆడియో క్లిప్ ను షేర్ చేర్ చేశాడు. అందులో మాట్లాడుతూ.. మీరు లక్కీగా స్వర్గానికి వెళ్లిపోయారు.. ఒకవేళ అక్కడ డెవలప్ జరిగి వాట్సాప్ లాంటివి ఏమన్నా ఉంటే అక్కడ అమృతం టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. అలాగే రంభ, ఊర్వసి, మేనక లు ఎలా ఉన్నారో చెప్తే కూడా చాలా సంతోషిస్తాను సార్.

అలాగే ఇంద్రుడు ఎలా ఉంటాడు .. అంటే పురణాల్లో చెప్పినట్టు ఇడియట్టా కాదా నాకు షేర్ చేస్తే నేను హ్యాపీ. మీరు స్వర్గంలో ఉన్నారు.. నేను హైదరాబాద్ లో ఉన్నాను అంతే అంతకంటే డిఫరెంట్ ఏమీ లేదు. తెలివున్నోడు ఎవ్వడైనా సరే స్వర్గంలోకి వెళ్లినందుకు సంతోషిస్తారు. ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది నాకు అనవసరం. నాకైతే మీరు అక్కడి వెళ్లడం సంతోషంగా ఉంది. మీకు కేవలం నా స్వార్థంతో ఒక ప్రేక్షకుడిగా, మీకు ఫ్యాన్ గా చెప్తున్నాను.. అన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టైలిష్ వేర్ లో నోరెళ్ల బెట్టిస్తున్న సమంత.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..

మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Related Post