దర్వాజ-హెల్త్& బ్యూటీ
Slap Therapy: అందంగా కనిపించడానికి యువతులు ఎంతటి సాహసాన్నైనా చేస్తుంటారు. నలుగురి చూపు తమ అందం పైనే ఉండాలని ఆశపడుతుంటారు. అందులో కొందరు సౌందర్య క్రీములను, సబ్బులను, లోషన్లు వాడుతుంటారు. మరికొందరైతే యూట్యూబ్ లో చెప్పే చిట్కాలను ఫాలో అవుతుంటారు. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా అమ్మాయిలు అందం కోసం ఏం చేస్తారో తెలిస్తే బాబోయ్ అలా కూడా చేస్తారా అని అనుకోకుండా ఉండరేమో.

ఇంతకీ వాళ్లు ఏం చేస్తారంటే రోజుకు కేవలం 50 చెంప దెబ్బలు వేసుకుంటారంతే.. వామ్మో.. 50 దెబ్బలా అని ఉలిక్కిపడుతున్నారా.. అవును రోజుకు 50 చెంప దెబ్బలు తింటే అందంగా కనిపిస్తారని అక్కడి మహిళలు నమ్ముతుంటారు. అయితే చెంప దెబ్బలు అంటే వాతలు వచ్చే విధంగా కాదండోయ్. అలాగని సుతిమెత్తగా కూడా కాదు.. రెండు చేతులతో ఏ మోస్తారుగా బాదుకుంటే సరి. ఈ స్లాప్ థెరపీ ఈ మధ్యన వచ్చింది కాదట.

వంద ఏండ్లకు పైగా ఈ పద్ధతిని అక్కడి మహిళలు అనుసరిస్తున్నారట. అయితే ఈ పద్దతి మొదటగా కొరియాలో వాడే వారట. ఈ థెరఫీ వల్ల నిజంగా అందంగా కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ పద్దతి వ్యాపించిందట. ఇది మూఢనమ్మకం కాదని నిపుణులుు అంటున్నారు. ఇలా కొట్టడం వల్ల ముఖానికి రక్తప్రసరణ పెరిగి చర్మం మృదువుగా మారడంతో పాటుగా కాంతివంతంగా కూడా అవుతుందట. అంతేకాదండోయ్ ఇలా చేయడం వల్ల ముఖాలు తాజాగా, ఎర్రగా కూడా కనిపిస్తాయని దీన్ని ఫాలో అవుతున్నారట అక్కడి జనాలు.
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?
సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..
పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?
నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..
పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి
వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..