Loading Now
natural treatment for diarrhoea

క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

క‌డుపు నొప్పిగా ఉంటూ.. ఎక్కువ సార్లు విరోచ‌నాలు అవుతున్నాయా? మీరు వెంట‌నే డాక్ట‌ర్ ను క‌న్స‌ల్ట్ అవ్వ‌వాల్సిందే.. ఎందుకంటే ఆ ల‌క్ష‌ణాలు డ‌యేరియా(అతిసారం) వ్యాధివి. ఇలాంటి ప‌రిస్థితి మీకు క‌నుక వ‌స్తే.. ఆల‌స్యం చేయొద్దు. అలా చేస్తే.. పరిస్థితులు దారుణంగా మారే అవ‌కాశం ఉంది. అయితే విరోచ‌నాలు ఎక్కువ‌గా కావ‌డానికి బాక్టీరియా, వైర‌స్లు కార‌ణం అవుతాయ‌ని వైద్య‌లు చెబుతున్నారు.

బ్యాక్టీరియా, వైర‌స్ ల నుంచే ఇది సంక్రమిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ డయేరియాకు కారణమైన బ్యాక్టీరియా మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేందుకు.. వాహ‌కాల సాయం తీసుకుంటాయి. ఆ వాహ‌కాలు మ‌నం తినే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా మ‌న‌కు ఆ రోగాన్ని అంటిస్తాయి. అందుకే మనం తినే ఆహార విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేక‌పోతే.. ఎన్నో స‌మ‌స్య‌లు రావ‌డం కాయ‌మ‌ని ఎంతో మంది నిపుణులు సూచిస్తున్నారు.

మ‌నం క‌నుకు జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే.. ఈ బాక్టీరియాలు, వైర‌స్ లు మ‌న శ‌రీరంలోకి ప్రవేశించి కడుపులోనున్న‌ ప్రేగుల కదలికలపై చెడు ప్ర‌భా‌వాన్ని చూపిస్తాయి.ఇవే కాకుండా అతిగా తిన‌డం, కెఫీన్, ఆల్కహాల్ లాంటి పదార్థాలను తీసుకోవ‌డం వ‌ల‌న కూడా డయేరియా వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. డయేరియా తో ప్రేగుల్లో అసాధారణమైన కదలిక‌లు వ‌స్తాయ‌ట‌. దీంతో తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. అలాగే ఆగ‌కుండా విరోనాలు అవుతాయి.

డ‌యేరియా బారిన ప‌డిన వెంట‌నే చేయాల్సిన ప‌ని:
డయేరియా సోకింద‌ని అనుమానం వ‌చ్చిన వెంట‌నే చికిత్స కోసం అందుబాటులో ఉన్న మందుల‌ను వాడాలి. కానీ వాటిని ఎలా ఎప్పుడు వాడాల‌న్న‌ది మ‌న‌కు తెలిసి ఉండాలి లేక‌పోతే.. స‌మ‌స్య తీవ్ర‌త‌రం అవుతుంది. డయేరియా బారిన ప‌డితే.. త‌క్ష‌ణ చికిత్స కోసం మ‌న వంట‌గ‌ది స‌రిపోతుంద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. వంట‌గ‌దిలో దొరికే ప‌దార్థాల‌తో త‌క్ష‌ణ రిలీప్ దొరుకుతుంద‌ని చెబుతున్నారు. అలాగే వాటితో ఏ ర‌క‌మైన ఇబ్బందులు కూడా ఉండ‌వ‌ని చెబుతున్నారు. ఇది ఎంతో గొప్ప విష‌య‌మ‌ని అంటున్నారు.

water-drink క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

ఏంటి ఆ వంటింటి చిట్కాలు:

పెరుగు
పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్స్ ఉంటాయి. దినాం పెరుగును మ‌న ఆహారంతో తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న ఆరోగ్యం ప‌దిలంగా ఉండ‌ట‌మే కాకుండా.. డ‌యేరియ లాంటి వ్యాధుల‌ను మ‌న ద‌రిదాపుల్లోకి రాకుండా చేయొచ్చిన చెబుతున్నారు. పెరుగులో అంటురోగాలను దూరం చేసే శ‌క్తి ఉంద‌ని కూడా చెబుతుంటారు.

మంచి నీళ్లు
మీరు క‌నుక డ‌యేరియాతో ఎంతో తిప్ప‌లు ప‌డుతుంటే.. మీ శ‌రీరం నీటి శాతాన్ని కోల్పోతూ వ‌స్తుంది. దీంతో మీరు బ‌ల‌హీనంగా త‌యార‌వుతారు. దీంతో మీరు డీహైడ్రేట్ కు గుర‌య్యే ప్ర‌మాధం పొంచి ఉంది. మాములు రోజుల్లో తాగే నీటి కంటే.. ఎక్కువ‌గా డ‌యేరియాకు గుర‌యిన‌ప్పుడు తాగాలి. అలా చేయ‌డంతో మ‌న శరీరానికి అవసరమైన శక్తిని తిరిగిపొందొచ్చు. దీంతో మ‌న శరీరం హైడ్రేట్ గా త‌యార‌వుతుంది. ఈ మంచి నీళ్లే.. కాకుండా ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ‌గా ఉండే కొబ్బరినీళ్ల‌ను కూడా తాగాలి. దీంతో శరీరం తొంద‌ర‌గా హైడ్రేట్ అవుతుంది.

మెంతులు
మెంతుల్లో హానికరమైన బ్యాక్టీరియా చంపే శ‌క్తి ఉంటుంది. ఇది మ‌న శ‌రీరాన్ని కాపాడ‌టంలో ఎంత‌గానో ఉపయోగ ప‌డుతుంది. తినే ఆహారంలో మెంతులను కొంచెం క‌లుపాలి. అవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 2-3 టీ స్పూన్ల మెంతి గింజలను దినాం తీసుకోవ‌డం వ‌ల‌న మీకు ఎంతో లాభం జ‌రుగుతుంది. రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను నాన‌బెట్టి.. పొద్దున్నే ఆ వాట‌ర్ ను తాగాలి. దాంతో మీ ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ లో యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి.ఇది ప్రేగుల కదలికల సమస్యలను తీర్చ‌డంలో సాయ‌ప‌డుతుంది. పెక్టిన్ అనే పదార్థం ఇందులో ఉంటుంది. ఇది మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజువారి ఆహారంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరానికి ఎంతో మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

honey క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

చమోమిలే టీ
ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువుంటాయి. ప్రేగుకు సంబంధించిన వ్యాధుల‌ను ఇది న‌యం చేస్తుంది. డ‌యేరియాతో బాధ ప‌డుతుంటే.. దీన్ని రోజులో 2 నుంచి 3 సార్లు తాగాలి. దీంతో మ‌నం త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతాము.

పసుపు, మజ్జిగ
ఎన్నో యాంటీసెప్టిక్ లక్షణాల‌ను ప‌సుపు క‌లిగి ఉంటుంది.దీనాం ఒక పసుపుకొమ్మును తీసుకుని దాన్ని మెత్తని పొడిగా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని మజ్జిగలో క‌ల‌పుకుని తాగాలి. ఇలా చేస్తే.. డ‌యేరియా నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం దొరుకుతుంది.

తేనె
తేనెలో ఎన్నో అత్యుత్త‌మ ల‌క్ష‌నాలు ఉంటాయి. ఎన్న‌టికీ పాడుకానీ వాటిల్లో తేనె మొద‌టిది. ఇది డయేరియాతో బాధపడుతున్నవాళ్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో 4 టీ స్పూన్ల తేనెను క‌లిపి తాగించాలి. దీంతో డ‌యేరియానుంచి మంచి ఉప‌శ‌మ‌నం దొరుకుతుంది.

orange-feal క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

అరటి
డ‌యేరియాతో బాధ‌ప‌డుతున్న వాళ్ల‌కు అర‌టి ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. అర‌టిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఉపశమనం త్వ‌ర‌గా వ‌స్తుంది. అలా అని ఎక్కువ కూడా తినొద్దంటా..

ఆరెంజ్ పీల్ టీ
ఆరెంజ్ పీల్ జీర్ణక్రియను మెరుగుపరుచ‌డంలో ఎంతో సాయం చేస్తుంది. డ‌యేరియాను నిరోధించడానికి కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. నారింజ పండు పీల్ ను తియాలి. వాటిని ముక్క‌లుగా చేసి మ‌రుగుతున్న నీటిలో వేయాలి. అలా మ‌ర‌గ‌కాచిన నీటిని చ‌ల్లార్చి తాగాలి. రుచి కోసం టీస్పూను తేనెను కలిపినా మంచిదే.

మేడారం జాతర‌కు వేళాయ‌రా..!

షుగ‌ర్ తో జ‌ర పైలం!

Share this content:

You May Have Missed