దర్వాజ-సినిమా
Payal Rajput: ఆర్ ఎక్స్ 100 మూవీతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే అందాల విందు ఇచ్చిన ఈ చిన్నది అతికొద్ది సమయంలోనే కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. అందాన్ని ఎక్స్ పోజ్ చెయ్యడంలో ఈ అమ్మడు ఏ మాత్రం వెనకాడదు. సినిమాల్లో ఈ అమ్మడు చేసే ఎక్స్ ఫోజింగ్ సరిపోదన్నట్టు సోషల్ మీడియాలో కూడా అందాన్ని ఏ మాత్రం దాయకుండా చూపించేస్తూ వస్తుంటుంది. ఇక పోతే ఈ భామ పుట్టిన రోజు నేడు.

సో ఈ చిన్నదాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. పాయల్ 2017 లో ‘చన్నా మెరేయా’ అనే మొదట పంజాబి మూవీ ద్వారా వెండితెరకు తెరంగేట్రం చేసింది. ఇక రెండో మూవీ బాలీవుడ్ లో చేసింది. ముచ్చటగా మూడో చిత్రంగా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టింది. మైమరచిపోయే అందాలతో ఏ మాత్రం తగ్గకుండా తన ఒంపు సొంపులను చూపించి కుర్రకారుకు గుండెల్లో తీయనైన గుబులు పుట్టించింది.

ఈ ముద్దుగుమ్మ 5 డిసెంబర్ 1992 లో ఢిల్లీలో పుట్టింది. నెగిటీవ్ షేడ్స్ లోనూ నటిస్తూ ఈ చిన్నది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ చిన్నది తరచుగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు నేత్రానందం కలిగిస్తూ ఉంటుంది. మున్ముందు పాయల్ కు మరిన్ని సినిమా అవకాశాలు అందుకోవాలని.. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరగాలని కోరుకుందాం.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బయ్ !
ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?
ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?
