దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Baldness problems: బట్టతల సామన్యంగా ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా వస్తుంది. అందులోనూ వయస్సుతో సంబంధం లేకుండా ఈ బట్టతల భారిన పడుతుంటారు. మరి బట్టతలకు గల కారణాలు తెలుసుకుందాం పదండి.. ఈ బట్టతల ముఖ్యంగా శరీరానికి ఒత్తిడి పెరిగినా.. పోషకాహార లోపం ఏర్పడినా వస్తుంది. అయితే కొందరికి మాత్రం వంశపారంపర్యంగా ఇవి వస్తాయి. కానీ చాలా మందికి శరీరంలో ఏర్పడే పోషకాల వల్లే వస్తుందని అధ్యయణాలు వెల్లడించాయి.

ఇందులో మన బాడీలో పొటాషియం తగ్గినప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కాస్త బట్టతలకు దారి తీస్తుంది. పొటాషియం బాడీలో తగిన మోతాదులో ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టు మూలాలను బలంగా ఉంచి హెయిర్ ఒత్తుగా, మందంగా పెరగడానికి కొల్లాజెన్ అనే మూలకం ఎంతో అవసరం. ఇది లోపించిన కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. నిర్జీవంగా కూడా తయారవుతుంది. సో ఈ మూలకం లోపించకుండా చూసుకోవాలి.

అన్నింటికీ మించి మన బాడీలో విటమిన్ సి లోపించినా బట్టతల వస్తుంది. సి విటమిన్ వల్ల వెంట్రెకలు బలంగా, ఒత్తుగా పెరుగుతాయి. అదే ఈ విటమిన్ లోపిస్తే మాత్రం కేశాలు బలహీనపడి ఊడిపోయి బట్టతలకు దారి తీస్తుంది. అలాగే మన శరీరంలో ఐరన్ లోపించినా కూడా బట్టతల వస్తుంది. ఈ ఐరన్ రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ మంచిగా జరగడంతో జుట్టు ఆరోగ్యంగా అందంగా మారుతుంది. వీటితో పాటుగా జింక్ లోపిస్తే కూడా జుట్టు రాలుతుంది. ఈ లోపాలు రాకుండా చూసుకుంటే బట్టతలకు చెక్ పెట్టొచ్చు.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బయ్ !
ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?
ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..