దర్వాజ-హెల్త్ అండ్ బ్యూటీ
Health: చాలా మంది నిద్రపోయిన తర్వాత పళ్లు పటపటమంటూ నిమిషాల తరబడి కొరుకుతూనే ఉంటారు. ఇలా కొరుకుతున్నామని వాళ్లకు కూడా తెలియదు. పక్కవాళ్లు చెప్పేంత వరకు మేం బాగానే పడుకున్నామని అనుకుంటారు. ఇలా పళ్లను కొరకడం వల్ల నిద్ర లేచిన వెంటనే దవడలు నొప్పి పెడతాయి. నొప్పి సంగతి పక్కన పెడితే ఇలా పళ్లను పటపటమని కొరకడం మూలంగా దంతాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి.
అందులో దవడలు నొప్పి పెట్టడం, దంతాలు విరిగిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. సో ఈ సమస్యను తొందరగా గుర్తించి.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
1.మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. మానసిక ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఎప్పుడూ పీస్ ఫుల్ గా ఉండేందుకు ప్రయత్నించండి. అందుకోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించి ప్రాణాయామం, యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి.
2. నిద్ర మనిషిని అలసటను మటుమాయం చేసే దివ్య ఔషదం. కంటి నిండా నిద్రతో అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నేడు నిద్రలేమి కారణంగా ఎన్నో రోగాల బారిన పడుతున్న వారున్నారు. అందుకే రోజూ ఒకే సమయానికి పడుకోవడం లేవడం లాంటివి అలవాటు చేసుకోవాలి. ఒక వేళ మీకు నిద్రలేమి ఉన్నట్టైతే వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.
3. బబుల్ గమ్ తినే అలవాటుంటే వెంటనే మానుకోండి. వీటిని నమలడం వల్ల కూడా పళ్లు కొరికే అవకాశం ఉంది. అలాగే గట్టిగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ను అస్సలు తినకండి.
ముఖ్యంగా మీ దవడ, ముఖ కండరాలను గట్టిగా పట్టి ఉంచకండి. కండరాలను ఎంత ఫ్రీగా ఉంచితే ఈ సమస్యనుంచి అంత తొందరగా బయటపడొచ్చు.
5. పళ్లు కొరకడం వల్ల దవడలు నొప్పి పుడితే కాపడం పెట్టండి. లేదా ఐస్ ను పెట్టండి.
6. ఈ సమస్య నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి రోజూ దంత వైద్యుడిని సంప్రదించాల్సిందే. డాక్టర్ చెప్పే సలహాలను, సూచనలను పాటిస్తే సరి. అలాగే డాక్టర్ ను సంప్రదించడం వల్ల మీ దంతాలు ఏమైనా దెబ్బతింటే కూడా వాటిని నయం చేయించుకోవచ్చు
Also Read:
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్
బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?
అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..
భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?
బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..
పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే