దర్వాజ-హెల్త్&బ్యూటీ
Routine life:ఉదయం లేచి ఉద్యోగానికి వెళ్లామా.. సాయంత్రం వచ్చామా..ఇంత సేపు టీవీ.. ఇంకొంచెం సేపు సెల్ ఫోన్లో గడిపామా.. రోజు గడిచిందా అన్నట్టుగానే ఉంటారు చాలా మంది. రోజూ ఇదే టైమింగ్స్ ఫాలో అవ్వడం వల్ల మన మానసికస్థితి మారదు. ఆరోగ్యం కూడా చురుగ్గా ఉండదు. అందుకే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పనులను చేస్తే మీలో వచ్చే ఆ ఛేంజెస్ ను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏయే పనులు చేయాలంటే..

రీడింగ్: ప్రతిరోజూ మీ పనులు అన్ని అయిపోయాకా.. ఒక గంటసేపు మీకు నచ్చిన బుక్స్ ను చదవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటుగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మీ ఆలోచనా శక్తిని కూడా పెంచుకోగలుగుతారు.
కుకింగ్: మీకు వంట చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఒక గంట పాటు వంట చేయడానికి సమయం కేటాయించండి. లేదా పెయింటింగ్ వేయాలనకుంటే అది కూడా చేయండి. మీకు ఇష్టమైన ఈ పనులను చేయడంతో మనస్సు ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుంది. నచ్చిన పనిని చేయడంలో వచ్చే ఆనందమే వేరు. అందుకే 6 తర్వాత మీకు నచ్చిన ఏదైనా ఒక పనిని చేయడానికి గంట సమయం పెట్టుకోండి.

డాన్స్, జిమ్: మీరు రోజూ కూర్చొనే ఉద్యోగం చేస్తే గనుక.. గంట సమయాన్ని జిమ్ లేదా డాన్స్ చేయండి. ఈ రెండింటిలో ఏది ఇష్టముంటే అది చేయండి. ఇలా చేస్తే మీరు ఫిట్ గా ఉండటంతో పాటుగా హెల్తీగా కూడా ఉంటారు.
ఫ్యామిలీతో స్పెండ్ చేయడం: వర్క్ నుంచి ఇంటికి రాగానే ఒంటరిగా ఉండకుండా కాసేపు ఫ్యామిలీ మెంబర్స్ తో గడపండి. ఒకవేల వారు మీకు దూరంగా ఉంటే..మీ వర్క్ కంప్లీట్ అయ్యాకా ఒక గంట పాటు ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడటానికి సమయం కేటాయించండి. అవకావముంటే వారిని కలిసి ముచ్చటించడం మంచిది. ఇలా చేయడం వల్ల మనసు తేలికపడుతుంది.
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్
బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?
అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..