దర్వాజ-అంతర్జాతీయం
Miss Universe 2021: ముచ్చటగా మూడోసారి భారత్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. 2021 ఇజ్రాయెల్ లో జరిగిన 70 వ మిస్ యూనివర్స్ పోటీల్లో.. భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సింధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీలో హర్నాజ్ విజయం సాధించి దేశం గర్వించేలా చేసింది. ఇక ఇందులో ఫస్ట్ రన్నరప్ గా పరాగ్వేకు చెందిన నదియా ఫెరిగా నిలిచారు. రెండో రన్నరప్ గా దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే నిలిచారు.

టాప్ 5 లో ఫిలిప్పీన్స్ కు చెందిన బీట్రైస్ గోమెజ్ చోటు దక్కించుకుంది. ఇకపోతే భారత్ కు మిస్ యూనివర్స్ కెరీటాన్ని దక్కించుకోవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 1994 లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ కెరీటాన్నీ దక్కించుకోగా, లారా దత్తా 2000 సంవత్సరంలో ఈ కెరీటాన్నీ సొంతం చేసుకుంది. ఇక వీరి తర్వాత మూడోసారి హర్నాజ్ కౌర్ సింధు సుమారుగా 80 మంది పోటీదారులందరిలో నుంచి మిస్ యూనివర్స్ నిలిచి దేశం గర్వించేలా చేసింది.

ఈ భామ పుట్టింది చంఢీఘర్ లోని పంజాబీ కుటుంబంలో. 2000 సంవత్సరంలో పుట్టిన హర్నాజ్ కౌర్ సింధు శివాలిక్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఇక పోతే ఈ సుందరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ ని పూర్తి చేసుకుని.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీని కొనసాగిస్తోంది. ఇక పోతే ఇమెకు డ్యాన్స్, గుర్రపు స్వారీ, ట్రావెలింగ్, యాక్టింగ్ అంటే మహా ఇష్టమట. అందులోనూ ఫిట్ నెస్ చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది.

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్
బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?
అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..