Breaking
Tue. Nov 18th, 2025

Justice Chandru | జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. ఏపీ హైకోర్టు సీరియస్

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు


దర్వాజ-అమరావతి
Justice Chandru: ఏపీ హైకోర్టు గురించి జస్టీస్ చంద్రు చేసిన తాజా వ్యాఖ్యలపై జడ్జి బట్టు దేవానంద్ మండిపడ్డారు. అసలు హైకోర్టు మొత్తాన్ని నిందించడమేంటనీ.. కొందరి న్యాయమూర్తులపై అభ్యంతరాలుంటే వాళ్ల వరకే ఆ విషయం పరిమితం కావాలి.. పోరాడాలి.. అంతే కానీ ఇలా హైకోర్టు మొత్తాన్ని నిందిస్తే ఎలా..? అంటూ ఏపీ హైకోర్టు జస్టిస్ చంద్రు పై మండిపడింది.

తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీ పరిస్థితులపై చంద్రుకు అవగాహన లేకుండా మాట్లాడినట్టుంది. ఇలా మాట్లాడటం.. హైకోర్టు గౌరవ, ప్రతిష్టలను దిగజార్చడమవుతుందని హైకోర్టు అన్నది. ‘జై భీమ్’ మూవీ చూసాకా జస్టిస్ చంద్రు పై గౌరవం చాలా పెరిగింది.. కానీ తాజాగా చేసిన ఆయన వ్యాఖ్యలతో ఆ గౌరవం పోయిందని జస్టిస్ దేవానంద్ అన్నారు.

విశాఖ పోలీసులు నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ను చిత్ర హింసలు పెట్టి దారుణంగా కొట్టారు. ఈ వ్యవహారం గురించి పూర్తిగా తెలుసుకుని సుధాకర్ గురించి చంద్రు సినిమా తీయించాలి. న్యాయస్థానాలు ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయి. న్యాయం చేస్తున్నాయి. కోర్టులిచ్చే తీర్పులపై అభ్యంతరాలు వ్యక్తమైతే అప్పీల్ కు వెళ్లాలి.. అంతే కానీ హైకోర్టును నిందిస్తే ఎలా అంటూ జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రశ్నించారు.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

Related Post