దర్వాజ-కోల్ కతా
Subhash Chandra Bose :స్వరాజ్య స్థాపన కోసం ఎంతో మంది నాయకులు ఆంగ్లేయులకు ఎదురునిలిచారు. స్వరాజ్యం మా జన్మ హక్కు అంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు. అందులో గాంధీ వంటి వారు అహింసా మార్గంలో స్వరాజ్యం కోసం పోరాడితే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటం చేస్తేనే ఆంగ్లేయులు దేశాన్ని విడిచి వెలతారని నమ్మిన ధీరుడు. ఆయన నమ్మిన ఆ సిద్ధాంతాన్నే ఆచరించాడు.
అందులోనే కనుమరుగయ్యాడు. కానీ ఆయన మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. అసలు నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా..? అన్నది ఇప్పటీకీ రహస్యంగానే మిగిలిపోయింది. నేతాజీ మరణం గురించి తెలుసుకునేందు విచారణ కమిషన్లను కూడా ఏర్పాటు చేశారు. అందులో నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారని ఖోస్లా కమిషన్, షానవాజ్ కమిషన్ లు తేల్చి చెప్పాయి. దీన్ని చివరి విచారణ కమిషన్ ముఖర్జీ కమిషన్ వ్యతిరేకించింది.
అందులోనూ తైపీలో ఏ విమాన ప్రమాదం జరగలేదని తైపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాంతో మళ్లీ పశ్చిమ బెంగాల్లో నేతాజీ మరణం కేసు బయటకు వచ్చింది. అందుకే నేతాజీ అదృశ్యం, మరణంపై మిస్టరీ పూర్తిగా తొలగిపోవాలని కోల్ కతా హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రెండు నెలల్లోగా నేతాజీ గారు చనిపోయారా..? లేక బతికే ఉన్నారా..? అనే విషయంపై స్పష్టత రావాలని ఆదేశించింది. కాగా నేతాజీ 1945 ఆగస్టు 18 న జపాన్ లో ఓ విమాన ప్రయాణంలో మరణించాడని కొందరు భావిస్తున్నారు.
జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?
సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?
మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
Share this content: