దర్వాజ-మహారాష్ర్ట
monkeys revenge: పగలు.. ప్రతికారాలు ఒక్క మనుషులకే అనుకుంటే పొరపాటే.. రివేంజ్ తీర్చుకోవడం ఇతర జీవులకు కూడా ఉంటుంది ఈ ఘటనను చూస్తేనే అర్థమవుతుంది. అసలు విషయమేమిటంటే.. ఒక కోతిపిల్లను కుక్కలు చంపడంతో కోతులన్నీ కుక్కలపై కక్ష కట్టాయి. దాంతో కుక్కలు ఏడ కనిపించినా వాటిని ఎత్తుకెళ్లి చంపడమే పనిగా పెట్టుకున్నాయి కోతులు. అట్లని ఒకటి రెండు కుక్కలని చంపాయనుకుంటే మన పొరపాటే.

ఈ వానరాలు ఏకంగా 250 కుక్కలను మట్టుపెట్టాయి. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్ గావ్ లో జరిగింది. కోతులు చేసిన ఈ దారుణానికి అక్కడి స్థానిక జనం స్వేచ్చగా బయట తిరగలేకపోతున్నారు..ఇంకా చెప్పాలంటే తమ పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. నెల రోజుల్లోనే ఏకంగా 250 కుక్కలను చంపాయంటే మామూలు విషయం కాదు.
కుక్కలు ఎక్కడ కనిపించినా అమాంతం వాటిని చెట్లపైకో, భవనం పైకో లాక్కెళ్లడం అక్కడి నుంచి కింద పడేసి చంపేయడం..ఇదే పనిగా పెట్టుకున్నాయి అక్కడి కోతులుు. ఈ కోతుల దాటికి ఆ గ్రామంలో ఒక్క కుక్క కూడా మిగల లేదని స్థానికులు వాపోతున్నారు. కుక్కలపైనే తమ ప్రతాపాన్ని చూపకుండా చిన్నపిల్లలపై కూడా చూపుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కోతుల దాటికి స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
Bigg Boss 5 Telugu Prize Money: బిగ్ బాస్ విన్నర్ కు ప్రైజ్ మనీ అంత ముడుతుందా..?
Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..
Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..
Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్
Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్
Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు
North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?
Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’
Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?
Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత
AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..
