దర్వాజ-లైఫ్ స్టైల్
Friendship: అన్ని రిలేషన్ షిప్ లో కెల్ల స్నేహ బంధం ఎంతో విలువైనది. కుటుంబ సభ్యలతో చెప్పుకోలేని విషయాలను కూడా ఫ్రెండుకు చెప్పుకుంటారు. స్నేహానికి మించిన గొప్ప బంధం లేదంటూ ఎంతో మంది విశ్వసిస్తుంటారు. ఆనందమైనా, బాధైనా, దుఖ:మైనా స్నేహితుడికే మొదటగా చెప్పుకునేది. లైఫ్ లో ఎన్ని అడ్డంకులెదురైనా.. స్నేహమొక్కటుంటే చాలు.. ఈ లోకాన్నే గెలవగమనే భావన కలుగుతుంది. అటువంటి స్నేహం అనుకోని అపార్థాల వల్ల ఒక్కోసారి బలహీన పడుతుంటుంది. మరి మీ మధ్య స్నేహం చెరిగిపోతుందని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.. అవేంటంటే.. ఈ ఆర్టికల్ ను చదివేయండి.
- మీరు ఒకరి విషయాలను ఒకరు పంచుకోవడానికి అస్సలు ఇష్ట పడరు. వీళ్లతో ఏంది చెప్పేది అని ఫీలయితే మీ స్నేహం దూరమవుతున్నట్టే లెక్క
- ఇంతకు ముందులా మీరు తరచుగా కలుసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ మీరు అనుకోకుండా కలిసినా.. ఎందుకు వీళ్లకు ఎదురుపడ్డానా అని ఫీలవుతారు. అందులోనూ వారితో ఉన్నంత సేపు మీరు ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
- మీ మధ్యన ఫ్రెండ్ షిప్ దూరమవుతున్నప్పుడు.. ఇద్దరి మధ్యలో వాగ్వాదం ఏర్పడి కోప్పడుతుంటారు. దానికి మీరు క్షమాపణలు చెప్పుకోకపోతే మీ స్నేహం తగ్గుతుందనే అనుకోవచ్చు. అందులోనూ వాళ్లు ఏం చేసినా.. కోపం వస్తూ ఉంటుంది.
- పర్సనల్ విషయాలను షేర్ చేసుకోరు. అలాగే మిమ్మల్ని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తారు. చూసి చూడనట్టు కనుక ఉండే మీ మధ్య స్నేహం బలహీన పడుతుందని అర్థం చేసుకోవచ్చు.
- ఇంతకు ముందులా మంచిగా మాట్లాడే మాటలు కరువైనా.. వారి మాటల్లో తేడా వచ్చినా మీ నుంచి వాళ్లు దూరంగా ఉంటారని అర్థం.
- ఇంతకు ముందులా కాకుండా ప్రవర్తనలో కూడా తేడాను చూపిస్తుంటారు. అంటే మీరంటే ఇష్టం లేనట్టు, అంటీ అంటనట్టు ..అస్సలు మీరొకరు ఉన్నారనే సంగతి మర్చిపోతుంటారు.
Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు
Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?
Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?
Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..
Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..
Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్
Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..
Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..