దర్వాజ-నేషనల్
GST: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నం. ఇక కొత్త సంవత్సరం రాకతో పాటుగా జీఎస్టీలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. కొన్ని రకాల వస్తువులపై జీఎస్టీ పెరగనుంది. ఇది జనవరి 1 నుంచి అమలు కాబోతుంది. వస్తు సేవల పన్నులో మార్పుల కారణంగా 2022 జనవరి నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చి సామాన్యులకు మరింత భారం కానున్నాయి.
దుస్తుల ధరలు పెరుగుతయ్:
జనవరి 1 నుంచి అన్ని రెడిమేడ్ దుస్తులు, రకరకాల వస్త్రాలపై రేట్లు పెరుగుతాయి. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ 5 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దానికి కొత్త సంవత్సరంలో 7 శాతం జీఎస్టీ ని చేర్చి.. 12 శాతం జీఎస్టీని విధిస్తారన్నమాట. ప్రస్తుతం 1000 లోపు కాస్ట్ ఉన్న రెడిమేడ్ దుస్తులవులపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కానీ కొత్త సంవత్సరం నుంచి MRPతో సంబంధం లేకుండా అన్ని రకాల రెడిమేడ్ బట్టలపై 12 శాతం జీఎస్టీ పడనుంది.
ఫుట్ వేర్ల ధరలు :
చెప్పుల ఖరీదుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలపై 12 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. ఇది వరకైతే 1000 రూపాయలకు పైన రేట్లుండే ఫుట్ వేర్లకు 5 శాతం జీఎస్టీని విధించే వారు. కానీ కొత్త సంవత్సరం నుంచి ధరలతో సంబంధం లేకుండా పాదరక్షలపై 12 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. ఇంకేముంది వచ్చే ఏడాది నుంచి షూస్, చెప్పుల ధరలు మరింత పెరగనున్నాయి.
ఆటో బుకింగ్ భారం:
ఆన్ లైన్ ద్వారా ఎవరైతే ఆటో ప్రయాణాలు చేస్తారో.. వారికి మరింత భారం పెరగనుంది. ఈ ఆన్ లైన్ ఆటో ప్రయాణాలపై కూడా ప్రభుత్వం జీఎస్టీని పెంచింది. ఇది జనవరి 1 నుంచి అమలు కానుంది. అయితే ఆఫ్ లైన్ ఆటో సేవలకు మాత్రం జీఎస్టీని విధించలేదు. అంటే బయట ఆటోను మాట్లాడుకుని ప్రయాణిస్తే జీఎస్టీ వర్తించదు.
స్విగ్గి, జొమాటో ఆర్డర్లపై జీఎస్టీ:
ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీలో ఆర్డర్లపై జీఎస్టీ పడనుంది. ఈ యాప్స్ ద్వారా ఎవరైతే ఫుడ్ ఆర్డర్ చేస్తారో వారు ఆ ఆర్డర్లపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. అయితే గతంలో ఓన్లీ రెస్టారెంట్ల నుంచే జీఎస్టీని వసూలు చేసేవి. కానీ కొత్త సంవత్సరం నుంచి స్విగ్గీ, జొమాటో ల ద్వారా జీఎస్టీని వసూలు చేయనున్నాయి. కాగా ప్రస్తుతం అన్ని రెస్టారెంట్లు కూడా జీఎస్టీని పరిధిలోకి రానున్నాయి.
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?
Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి
Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?
Inter First Year Result: వాళ్లందరూ పాస్..