దర్వాజ-నేషనల్
Gold Rates Today: బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుుడు తగ్గుతాయో చెప్పడం కష్టంతో కూడుకున్నదే. అందుకే ధరలు తగ్గినయి అని వార్త తెలిస్తే చాలు షాపుల ముందు వాలిపోతుంటారు. ఇక ఈ మధ్యన బంగారం ధరలు తరచుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు కూడా పసిడి ధర కాస్త దిగొచ్చింది. ప్రస్తుతం బంగారం ధరలు వివిధ నగరాల్లో ఈ విధంగా ఉన్నాయి. రెండు రోజుల నుంచి తగ్గుకుంటూ వస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం హైదరాబాద్ లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.రూ.48,220గా ఉంది.
నిన్నటి ధరతో పోల్చితే ఈ రోజు రూ.20 తగ్గింది. ఇక 22 క్యారెట్ల పసిడి 47,220 రూపాయలుగా కొనసాగుతోంది. అంటే ఒక గ్రాముకు రూ.4,772 గా పలుకుతోంది. ఇది కూడా నిన్నటితో పోల్చితే 20 రూపాయలు దిగొచ్చింది. హైదరాబాద్ లో ఉన్నట్టు గానే పసిడి ధర ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణాల్లోనూ ఒకే విధంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం న్యూఢిల్లీలో రూ.51,800 గా ఉంటే.. కోల్ కతాలో రూ.50,100 గా ఉంది. చెన్నైలో రూ.49,580 గా, బెంగుళూరు, కేరళలలో రూ. .49,480 గా పలుకుతోంది.
ఇకపోతే 22 క్యారెట్ల పసిడి ధర విషయానికొస్తే.. న్యూఢిల్లీలో రూ.47,500 గా ఉంటే, కోల్ కతాలో ఈ ధర రూ. 47,400 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.45,440 గా ఉండగా.. ముంబైలో రూ.47,220 గా ఉంది. బెంగుళూరు, కేరళలలో రూ.45,350 గా పలుకుతోంది. ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుతం వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో తులానికి రూ.625 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధర నిన్నటితో పోలిస్తే 2 రూపాయలు పెరిగిందనే చెప్పాలి. ఇక కేజీ వెండి ధర రూ.62,500 గా ఉంది.
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Periods: పీరియడ్స్ ప్రతినెలా రావడం లేదా.. అయితే వీటిని పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Share this content: