దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Sweater Dangers:చలికాలంలో స్వెటర్ ధరించకుండా ఉండటం చాలా కష్టమే. కొందరైతే బయటకు వెళ్లడానికి కూడా పక్కాగా స్వెటర్ ఉండాల్సిందే అంటారు. ఇక అందులోనూ నైట్ టైం స్వెటర్ వేసుకోకుండా నిద్ర కూడా పోరు. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటుగా.. చల్ల గాలుల నుంచి శరీరాన్ని కాపాడటంలో స్వెటర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే చలికాలం స్టార్ట్ కాకముందే చాలా స్వెటర్స్ ను కొంటారు. చల్లగాలుల నుంచి రక్షించే ఈ స్వెటర్స్ రాత్రి పూట వేసుకుని అలాగే పడుకుంటే మాత్రం మంచిది కాదు. స్వెటర్ ధరించి నిద్రపోతే మన శరీరంలో ఇబ్బందికరమైన మార్పులు సంభవిస్తాయి. అవేంటంటే..?
1.చర్మ సమస్యలు: రాత్రి పూట చలి బాగా పెడుతుందని స్వెటర్ వేసుకుని పడుకుంటే మాత్రం చర్మం పై పొడిబారుతుంది. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లుల కూడా వస్తాయి. వెచ్చదనాన్ని కలిగించే దుస్తులు ఎప్పుడూ స్కిన్ ను పొడిగా ఉంచుతాయి. అందులోనూ కొందరికి ఈ స్వెటర్స్ తో అలర్జీ కూడా వస్తుంటుంది.
2.బీపీ సమస్య: స్వెటర్ వేసుకుని పడుకుంటే.. రాత్రి వేళల్లో బీపీ తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట స్వెటర్ తో పడుకుంటే.. అకస్మత్తుగా చెమటలు కూడా పడతాయి. సో స్వెటర్ కు బదులుగా వెచ్చగా ఉండే దుప్పట్లను కప్పుకోవడం అలవాటు చేసుకోండి.
3.శ్వాస సమస్య: మీకు శ్వాస తీసుకోవడంలో సమస్యలేమైనా ఉన్నట్టైతే స్వెటర్ ధరించి నిద్రపోవడం మానేయండి. ఎందుకంటే స్వెటర్స్ ఆక్సిజన్ కు అడ్డుగా ఉంటాయి. దాని వల్ల మీరు శ్వాస సమస్యను ఎదుర్కోవచ్చు.
- ఈ సమస్య ఉంటే మరింత హానీ: ఒక వేళ మీకు బీపీ సమస్య, మధుమేహం సమస్యలు ఉంటే.. ఈ సమస్యను మరింత రెట్టింపు చేస్తాయి స్వెటర్స్. వేడి కలిగించే దుస్తుల్లో పీచు ఎక్కవ మొత్తంలో ఉంటుంది. ఇక ఇవి రాత్రి పూట వేసుకుని పడుకోవడం శరీరంలోని వేడి బయటకు రాదు. సో స్వెటర్స్ వేసుకుని పడుకోకపోవడం ఉత్తమం.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు డాక్టర్ల సూచనలు, సలహాలను తీసుకోండి.
Gold Rates Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Periods: పీరియడ్స్ ప్రతినెలా రావడం లేదా.. అయితే వీటిని పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Share this content: