దర్వాజ-జాతీయం
Vaccination: నేటి నుంచి దేశంలో 15-18 ఏండ్ల మధ్యనున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. టీకా పంపిణీ కోసం జనవరి 1 వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. కాగా 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య నున్న చాలా మంది టీనేజర్లు ఇప్పటికే కొవిన్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వ్యాక్సిన్ కోసం జనవరి 2 వ తేదీ మధ్యాహ్నం వరకు సుమారుగా 4.5 లక్షల మంది టీనేజర్లు విన్ పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటుగా 12 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి రిజిస్టర్ చేసుకున్న టీనేజర్లకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాగా జిల్లాల వారిగా టీనేజర్లు ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవచ్చని అధికారులు వెళ్లడించారు. ఇకపెద్దలకు ఇచ్చినట్టుగానే టీనేజర్లకు కూడా 0.5 మిల్లీ లీటర్ల మోతాదులో టీకాను వేస్తారు. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా 22,78,683 మంది టీనేజర్లు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక టీకాల పంపిణీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసినట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలియజేశారు. కాగా టీకాలు వేసుకున్న తర్వాత అరగంట పాటు డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. టీకా వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురైనా.. వెంటనే చికిత్స చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెళ్లడించారు.
Deepthi-Shanmuk Breakup: షణ్ను, దీప్తిల బ్రేకప్ కు కారణం నేను కాదు: సిరి
WhatsApp Accounts Ban: 17.5 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?
Varshini Hot Show: అరే ఏంట్రా ఇది.. వర్షిణీ ఇలా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది..?
India Corona Updates: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Police Thieves: సెలబ్రేషన్స్ కోసం మేకలను దొంగలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తి ఏందయ్యా సామీ..?
Liquor Sales: మందు బాబులా మజాకా.. ఒక్క 5 రోజుల్లోనే ఇన్ని కోట్లు తాగేసారా..!
Share this content: