దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Hot Food Effects: చలి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది వేడి వేడిగా ఆహారాన్ని తినడానికి ఇష్ట పడుతుంటారు. మరికొంతమందైతే..కాలాలతో సంబంధం లేకుండా వేడి ఫుడ్ నే తింటూ ఉంటారు. మరొక విషయం ఏమిటంటే.. వేడి ఫుడ్ రుచిగా ఉండటంతో కూడా చాలా మటుకు ఉడుకుగా ఉన్నప్పుడే తినడానినకి ఇష్టపడుతుంటారు. కానీ వేడిగా ఆహారాన్ని తింటే శరీరానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చల్లగా ఉన్నా.. రుచిగా అనిపించకపోయినా.. చల్లగానే తినడం ఉత్తమం. ఇంతకి వేడిగా ఆహారాన్ని తీసుకుంటే ఏమౌతుందంటే..
- ఏ కాలంలో నైనా ఆహారాన్ని వేడిగా తినడం వల్ల కడుపు దెబ్బతింటుంది. క్రమంగా వేడి ఫుడ్ ను తీసుకోవడం మూలంగా పొట్టలోపలున్న సున్నితమైన చర్మం కూడా పాడవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటుగా కడుపు నొప్పి, కడుపు మంట కూడా వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.
- చల్లగా ఉండే ఆహార పదార్థాలే దంతాలకు నష్టం కలిగిస్తాయని అందరూ భావిస్తారు. అయితే వేడి ఉండే ఆహారం కూడా దంతాలను పాడుచేస్తుంది. వేడి ఫుడ్ ను తినడం వల్ల పళ్లలో ఉండే ఎనామిల్ పగుళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
- వేడి వేడిగా ఫుడ్ ను తీసుకునే ప్రాసెస్ లో కొన్ని కొన్ని సార్లు నాలుకను కాల్చుకుంటూ ఉంటారు. ఇలా కాలడం మనకు సర్వసాధారణం అయినప్పటికీ.. ఆ కాలిన ప్లేస్ నయం కావాలంటే మాత్రం చాలా రోజులే పడుతుంది. దాంతోపాటుగా నోటి లోపల కూడా అనేక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ ఆ సమయంలో చల్లగా ఉండే ఫుడ్ నే తినాల్సి వస్తది.
- వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు కొన్ని సమయాల్లో గొంతులోపల కాలే అవకాశాలున్నాయి. అలా కాలినప్పుడు గొంతు వాపు కూడా వస్తుంది. ఈ వాపు కొద్దిగా ఉంటే పర్లేదు కానీ.. పెద్దగా కనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం బెటర్.
Vaccination: నేటి నుంచి 15-18 ఏండ్ల వారికి వాక్సినేషన్.. అరగంట పాటు కేంద్రం లేనే..!
Deepthi-Shanmuk Breakup: షణ్ను, దీప్తిల బ్రేకప్ కు కారణం నేను కాదు: సిరి
WhatsApp Accounts Ban: 17.5 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?
Varshini Hot Show: అరే ఏంట్రా ఇది.. వర్షిణీ ఇలా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది..?
India Corona Updates: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Police Thieves: సెలబ్రేషన్స్ కోసం మేకలను దొంగలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తి ఏందయ్యా సామీ..?
Share this content: