దర్వాజ-సినిమా
Rashmika-Vijay Devarakonda: ‘గీత గోవిందం’ సినిమా చూసినప్పటి నుంచీ విజయ్ దేవరకొండ, రష్మిక మందానలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికార్లు కొట్టాయి. అలా వార్తలు రావడానికి బలమైన కారణం లేకపోలేదు. ఆ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ.. రొమాన్స్ ఆ రేంజ్ లో జరిగింది మరి. ఈ ఆన్ స్క్రీన్ జోడీ నెటీజన్ల మనుసును దోచేసింది. సూపర్ పెయిర్ అంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక దాంతో పాటుగా బయట కూడా ఈ జంట అప్పుుడప్పుడూ కెమెర కంట పడుతూ.. వీళ్ల రిలేషన్ షిప్ నిజమనే వార్తలకు ఊతం ఇస్తున్నాయి. ఇదీ కాకుండా రష్మిక కన్నడ యాక్టర్ రోహిత్ శెట్టితో నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంది.
ప్రియుడు రోహిత్ శెట్టితో పెళ్లిని వద్దనుకుందంటే.. నిజంగానే విజయ్ దేవరకొండకు, రష్మిక మందానకు మధ్య ప్రేమ వ్యవహారం ఖచ్చితంగా నడుస్తుందని అందరూ భావించారు. విజయ్ మీద ప్రేమతోనే రోహిత్ తో నిశ్చితార్థాన్ని క్యాన్సల్ చేసుకుందని కామెంట్లు వచ్చాయి. అయితే రష్మిక మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పుకుంటూ వచ్చింది. అర్జున్ రెడ్డి కూడా అలాంటివి ఏమీ లేవని ఆ వార్తలను కొట్టిపడేసాడు. ఇక తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ మళ్లీ వీళ్ల ప్రేమ కథను మొదటికి తెచ్చారు. విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాకు వెళ్లారు.
ఇన్ స్టాగ్రామ్ వేధికగా వారి అభిమానులు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కాగా రష్మిక మందాన కూడా అదే సమయంలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో విచిత్రం ఏమిటంటే.. రష్మిక మందాన పెట్టిన ఫోటోలోని బ్యాగ్రౌండ్ లొకేషన్, ఆనంద్ షేర్ చేసిన ఫోటో బ్యాగ్రౌండ్ సేమ్ గా ఉన్నాయి. దాంతో రష్మిక మందాన, విజయ్ దేవరకొండలు సేమ్ ప్లేస్ లో ఉన్నారు.. వాళ్లు ఖచ్చితంగా డేటింగ్ లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదీ కాకుండా వీళ్ల రిలేషన్ షిప్ కు ఊతం ఇచ్చేలా.. క్రిస్ మస్ సెలబ్రేషన్స్ అంటూ.. డిన్నర్ కు వెళ్లి రావడంతో కెమెరా కంట్లో పడుతూనే ఉన్నారు.
Gold-Silver Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Sreemukhi: అదిరేటి అందాలతో హొయలు పోతున్న శ్రీముఖి.. వావ్ వాటే బ్యూటీ అనాల్సిందే..
Shraddha Das: బికినీలో పరువాల విందును ఇచ్చేస్తున్న శ్రద్ధాదాస్.. మరీ ఇంత హాట్ అయితే ఎట్టా అమ్మడు..
YS Sharmila: ఏపీలో పార్టీ పెట్టకూడదనే రూల్ లేదు కదా : షర్మిల
Hot Food : వేడి వేడిగా ఆహారాన్ని తింటున్నారా..? అయితే మీరు ఆ ప్రమాదాల్లో పడ్డట్టే..
Share this content: