Breaking
Sat. Jun 28th, 2025

RGV: సపోర్ట్ చేయాల్సింది పోయి.. మా నెత్తి మీద కూర్చుంటున్నారు: ఆర్జీవీ

rgv
rgv

దర్వాజ-సినిమా

RGV: సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వానికి.. సినీ ప్రముఖులకు మధ్యన మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా టికెట్ల ధరలను నిర్ణయించడం జరిగిందని ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. మరీ ఇంత దారుణంగా తగ్గించడం ఇదెక్కడి న్యాయం అంటూ సినీ ప్రముఖులు అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ రేట్ల మూలంగా పెద్ద పెద్ద సినిమాలు చాలా నష్టపోతున్నాయని.. మళ్లీ ఒక సారి ఈ టికెట్ల రేట్లపై ఆలోచించాలని సినీ నిర్మాతలు గవర్నమెంటును డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

ఈ ఇష్యూపై సినీ ప్రముఖులు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా.. ఎంత ఎత్తి చూపినా.. ఏపీ గవర్నమెంట్ మాత్రం తగ్గేదేలేదన్నట్టు వ్యవహరిస్తుంది. అయినా సినీ ప్రముఖులు గవర్నమెంటును విమర్షించడంపై వెనక్కి తగ్గడం లేదు. ఒక్కొక్కరుగా టికెట్ల రేట్లపై స్పందిస్తూనే ఉన్నారు. మాటకు మాటలు అనుకుంటూ ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఈ ఇష్యూపై రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్లో ఏపీ గవర్నమెంట్ పై ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని పై ట్విట్టర్ వేధికగా ప్రశ్నల వర్షం కురిపించారు. నేను అడిగే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను.. అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నాడు.

సినిమాలతో పాటుగా ఏదైనా ఉత్పతికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఏంటీ సార్ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు నిత్యవసర సరుకులైన కిరోసిన్, గోదుమలు, బియ్యం, వంటనూనె లకు కొరత ఏర్పడితే ప్రభుత్వం కలుగజేసుకుని మరీ ధరలను నిర్ణయించి వాళ్లకు అందుబాటులోకి తీసుకొస్తాయని తెలుసు. కానీ ఇదే అంశం సినిమాలకు కూడా ఎలా వర్తింసుందని ఆర్జీవీ ఘాటుగా ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లను కూడా ప్రభుత్వమే నిర్ణయించడానికి గల పరిస్థితులేంటో పేర్ని నానిగారు వివరించాలని ఆర్జీవి కోరారు. కాగా రైతులు పంట విషయంలో నష్టపోతున్నప్పుడు గవర్నమెంట్ వారికి మద్దతు ధరను నిర్ణయించి వారిని ఆదుకుంటుంది. ఇదే సిద్దాంతం సినీ నిర్మాణానికి కూడా వర్తిస్తుంది కదా అంటూ ఆర్జీవీ అన్నారు.

Rashmika-Vijay Devarakonda: రష్మిక, విజయ్ దేవరకొండ నిజంగానే ప్రేమలో పడ్డారా..?

Gold-Silver Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Sreemukhi: అదిరేటి అందాలతో హొయలు పోతున్న శ్రీముఖి.. వావ్ వాటే బ్యూటీ అనాల్సిందే..

Anasuya Without Makeup: తూచ్.. ఇది పెద్ద స్కామ్..ఇదే మీ అసలు రూపం.. అంటూ యాంకర్ అనసూయపై కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటీజన్లు.. విషయం ఏమిటంటే..?

Shraddha Das: బికినీలో పరువాల విందును ఇచ్చేస్తున్న శ్రద్ధాదాస్.. మరీ ఇంత హాట్ అయితే ఎట్టా అమ్మడు..

YS Sharmila: ఏపీలో పార్టీ పెట్టకూడదనే రూల్ లేదు కదా : ష‌ర్మిల

Related Post