దర్వాజ-సినిమా
Covid 19 : కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికే ఎంతో మందిని బలిగొన్న ఈ మహమ్మారి భారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో ప్రభుత్వాలు కూడా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయినా కరోనా వ్యాప్తి కొంచెమైనా ఆగకపోగా.. రోజు రోజుకు ఈ మహమ్మారి వ్యాప్తి మరింత తీవ్రతరం అవుతోంది.

ఇక తాజాగా సినీ సెలబ్రిటీలు చాలా మంది కరోనా భారిన పడుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, విష్వక్ సేన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్. థమన్ లు కొవిడ్ భారిన పడ్డారు. ఇక తాజాగా ఈ లీస్ట్ లో మరో ఇద్దరు సెలబ్రిటీలు చేరారు. వర్షం బ్యూటీ త్రిష.. బాహుబళి మూవీలో కట్టప్పగా నటించిన సీనియర్ నటుడు సత్యరాజ్ లకు కరోనా సోకింది.
సత్యరాజ్ కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఉన్నా.. తాజాగా ఆస్పత్రిలో చేరారు. ఇక త్రిషకు కరోనా పాజిటీవ్ అని తేలడంతో ఈ విషయాన్ని ట్విట్టర్ వేధికగా తెలియజేసింది. తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. కొవిడ్ సోకిందని ఆమె తెలిపింది. కాగా అతి తొందరలోనే కోలుకుంటానని త్రిష ట్వీట్ చేసింది. అయితే సినీ ఇండస్ట్రీలో కరోనా కల్లోలం మొదలవడంతో చాలా సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. అలాగే రిలీజ్ కావాల్సిన సినిమాలు సైతం.. పోస్ట్ పోన్ అయ్యాయి.
Turmeric Side Effects: పసుపును ఈ వ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?
Covid-19 New Variant : వెలుగులోకి వచ్చిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్..
Deepthi Sunaina: దీప్తి సునయన బాధలో ఉంటే .. షణ్ముఖ్ సిరితో చిల్ అవుతున్నాడా..?
RGV: సపోర్ట్ చేయాల్సింది పోయి.. మా నెత్తి మీద కూర్చుంటున్నారు: ఆర్జీవీ
Rashmika-Vijay Devarakonda: రష్మిక, విజయ్ దేవరకొండ నిజంగానే ప్రేమలో పడ్డారా..?
