దర్వాజ-సినిమా
Keerthy suresh: కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినీ వదలడం లేదు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లో కరోనా (Covid-19) బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టాలీవుడ్ లో అయితే, ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు కోవిడ్-19 బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరోయిన్ త్రిష, సంగీత దర్శకుడు తమన్, సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, నటుడు, సీని నిర్మాత బండ్ల గణేశ్, హీరో మంచు మనోజ్, మంచు లక్ష్మీ, సీనియర్ హీరోయిన్లు శోభన, కుష్బూ, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ తదితరులకు కరోనా వైరస్ బారినపడ్డారు. మంగళవారం నాడు పవర్ స్టార్ మాజీ భార్య, హీరోయిన్ రేణూ దేశాయ్, అకీరా నందన్ లకు సైతం కరోనా (Coronavirus) సోకింది.
ఈ క్రమంలో టాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహానటి కీర్తి సురేశ్‌కు (Keerthi Suresh tested positive) కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా సోకిందనీ, ప్రస్తుతం ఐసోలేషన్ ఉన్నాని పేర్కొంది. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట, మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాల్లో నటిస్తుంది.
Read more
Coronavirus: తెలంగాణలో భారీగా కరోనా కొత్త కేసులు
Covid 19 : త్రిషకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన కట్టప్ప..
Turmeric Side Effects: పసుపును ఈ వ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?
Covid-19 New Variant : వెలుగులోకి వచ్చిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్..
Deepthi Sunaina: దీప్తి సునయన బాధలో ఉంటే .. షణ్ముఖ్ సిరితో చిల్ అవుతున్నాడా..?
