దర్వాజ-న్యూఢిల్లీ
Coronavirus: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగతున్నది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో కరోనా థర్డ్ వేవ్ భయాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క రోజే దాదాపు రెండు లక్షల కరోనా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 1,94,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,60,70,510కి చేరాయి. కొత్తగా 60,405 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3,46,30,536 మంది కోవిడ్-19 నుంచి బయటపడ్డారు. యాక్టివ్ కేసులు సైతం భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 9,55,319 క్రియాశీల కేసులు ఉన్నాయి.
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్ తో పోరాడుతూ.. 442 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,84,655కు పెరిగింది. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుంటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05కు పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read more:
Keerthy suresh: టాలీవుడ్ ను వదలని కరోనా.. ప్రముఖ హీరోయిన్ కు పాజిటివ్
Coronavirus: తెలంగాణలో భారీగా కరోనా కొత్త కేసులు
Covid 19 : త్రిషకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన కట్టప్ప..
Turmeric Side Effects: పసుపును ఈ వ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?
Covid-19 New Variant : వెలుగులోకి వచ్చిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్..
Share this content: