Breaking
Tue. Nov 18th, 2025

యుద్ధం చివ‌రి అప్ష‌న్ మాత్ర‌మే.. అదే జ‌రిగితే.. విజ‌యం మ‌న‌దే: ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే

Army chief General MM Naravane
Army chief General MM Naravane

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

India: యుద్ధం అనేది చివరి అస్త్రమ‌నీ, ఒక‌వేళ ఆ యుద్ధ‌మే జ‌రిగినా.. దాంట్లో విజ‌యం మ‌న‌దే అవుతుంద‌ని భార‌త ఆర్మీ చీఫ్ ఎంఎం. న‌వ‌ర‌వాణే అన్నారు. ఉత్త‌ర భార‌త స‌రిహ‌ద్దుల్లో ఉన్నఉద్రిక్త ప‌రిస్థితుల‌పై మాట్లాడుతూ న‌ర‌వాణే ఈ వ్యాఖ్య‌లు చేశారు. స‌రిహ‌ద్దుల్లో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అదుపులోనే ఉన్నాయ‌నీ, రెండు దేశాల (చైనా) మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు. అయితే ప‌రిస్థిత మ‌ళ్లీ ఉత్కంఠంగా మారుతాయా లేదా చెప్ప‌లేమ‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌దాన్ని బ‌ట్టి చూస్తే, మ‌నం ప‌టిష్టంగా ఉన్నామ‌ని న‌వ‌ర‌ణే వెల్ల‌డించారు. యుద్ధం అనేది చివ‌రి ఆప్ష‌న్ అవుతుంద‌ని, ఒక‌వేళ ఆ యుద్ధ‌మే జ‌రిగినా.. దాంట్లో విజ‌యం మ‌న‌దే అవుతుందంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అలాగే, భారతదేశం-భూటాన్‌లతో ప్రాదేశిక సరిహద్దులను ఏకపక్షంగా వివరించడానికి, గుర్తించడానికి ప్రయత్నిస్తున్న చైనాకు చెందిన కొత్త భూ చట్టం కట్టుబడి లేదని కూడా జనరల్ నరవాణే స్పష్టం చేశారు. చైనా రూపొందించిన కొత్త స‌రిహ‌ద్దు చ‌ట్టాన్ని ఆయ‌న ఖండించారు. కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింద‌ని తెలిపారు. ఆ చ‌ట్టం ద్వారా ద్వైపాక్షిక సంబంధాల‌కు ఎటువంటి అవ‌రోధం ఉండ‌ద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. ప‌శ్చిమ స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదులు పెరుగుతున్నార‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

Read more:

Coronavirus: 2 లక్షలకు చేరువలో కరోనా కొత్త కేసులు.. ఎంత మంది చ‌నిపోయారంటే.. ?

Keerthy suresh: టాలీవుడ్ ను వ‌ద‌ల‌ని క‌రోనా.. ప్ర‌ముఖ హీరోయిన్ కు పాజిటివ్

Coronavirus: తెలంగాణ‌లో భారీగా క‌రోనా కొత్త కేసులు

Covid 19 : త్రిషకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన కట్టప్ప..

Polished rice: పాలిష్ చేసిన బియ్యం తింటే మంచిదా..? కాదా..? అసలు ఈ బియ్యాన్ని తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తెలిస్తే షాక్ అవుతారు..?

Turmeric Side Effects: పసుపును ఈ వ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Related Post