Breaking
Tue. Nov 18th, 2025

RRRMovie: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ర‌చ్చ‌ర‌చ్చే.. !

RRR Releasing date

RRRMovie: ద‌ర్శకధీరుడు జక్కన్న, ఇండియ‌న్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నభారీ బ‌డ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే ప‌లుమార్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి.. వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. అయితే, తాజాగా మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేశారు. ఇటీవ‌ల‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని ప్రకటించింది కానీ తాజాగా ఈ రెండు రోజులు కాకుండా సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇదే ఫైన‌ల్ అప్‌డేట్ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. కాగా, ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్లీ స్టారర్ మూవీ.

Related Post