దర్వాజ-హైదరాబాద్
Telangana: తాను జాతీయ రాజకీయాల (National Politics) దిశలో పయనిస్తున్నాననీ, ఈ ప్రయత్నానికి తన మనస్సును, శరీరంలోని చివరి ఔన్స్ రక్తాన్ని వినియోగిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (CM KCR) బుధవారం అన్నారు. ‘‘రాష్ట్రంలోనే కాదు, దేశం నలువైపులా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కూడా ధర్మం ప్రకారం పనిచేసే ప్రభుత్వం కావాలి. అనేక అంశాలను విశ్లేషించడం, అవగాహన చేసుకోవడం ద్వారా ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కులం, మతం పేరుతో నిప్పులు కురిపిస్తే హైదరాబాద్ (Hyderabad) ఈరోజు ఉండేది కాదు. ఇది ప్రమాదకరమైనది. ఈ క్యాన్సర్‌ను అరికట్టాలి.. ఈ దేశం నుండి తరిమి కొట్టాలి” అని ఆయన అన్నారు.
మల్లన్న సాగర్ (Mallannasagar project) రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. చీకటి శక్తులు ఈ ప్రాజెక్టు పురోగతిని అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాయనీ, అయితే వాటన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టిందని కేసీఆర్ (cm kcr) అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన కార్మికులకు, ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ చీకటి శక్తులు ఈ ప్రాజెక్ట్‌పై 600 కంటే ఎక్కువ కేసులు పెట్టాయి. హరీశ్‌రావు (T. Harish Rao) మొదటి టర్మ్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. వారు అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇన్ని ఉన్నా క్రమశిక్షణతో జీరో కరప్షన్ లేకుండా ప్రాజెక్టు కట్టాం. ఇది మల్లన్న సాగర్ కాదు, తెలంగాణ ప్రజల హృదయ సముద్రం. రాష్ట్రంలో కరువు మళ్లీ రాకుండా చూస్తుంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రం (Telangana) లోని నీటి ప్రాజెక్టులపై విషయ పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నాయని ప్రతిపక్షాలపై సీఎం మండిపడ్డారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందజేయాలన్నారు. “వారు చాలా త్యాగం చేశారు. హరీష్ రావు మరియు అధికారులను వ్యక్తిగతంగా కలవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు మరో 100 కోట్లు ఖర్చు అయినా సరే. అందరూ సంతోషంగా ఉండాలి’’ అని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కోరారు. షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలి. లైట్లు వేయాలి. సింగపూర్ నుండి పర్యాటకులు దీనిని సందర్శించడానికి రావాలి..”అని కేసీఆర్ అన్నారు.
కాగా, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మెదక్, దాని పొరుగు జిల్లాలలోని ఫ్రేమర్ల అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేయబడింది. తొగుట, కొండపాక మండలాల మధ్య రూ.6.805 కోట్లతో కొండవాలు ప్రాంతంలో నిర్మించి 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 30 టీఎంసీల నీరు హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చనుంది. మరో 16 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు సరిపోతాయి.
