Anasuya Bharadwaj:ఒక వైపు సినిమాల్లో, మరో వైపు బుల్లితెరపై తన సత్తాను చూపెడుతూనే ఉంది యాంకర్ అనసూయ. రంగమత్తగా రంగస్థలం సినిమా ద్వారా ఈ అమ్మడు ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడుకి సినిమాల్లో బానే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ మధ్యనే అల్లు అర్జున్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించిన పుష్ప సినిమాలో దాక్షయణి గా నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది.
ఒక వైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపై షో లు చేస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అనసూయ భరద్వాజ్. సమయం కుదిరినప్పుడల్లా.. సోషల్ మీడియాలో తన ఫోటోస్ షేర్ చేయడమో.. లేకపోతే ఏదో ఒక వివాదస్పద ట్వీట్ చేస్తూ ట్రోలింగ్ కు గురవ్వడమో జనరల్ గా జరిగే ప్రాసెస్ యే. ఈ విషయం అందరికీ తెలిసిందే. చాలా విషయాల్లో అనసూయను నెటిజన్లు ట్రోల్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక ఆ ట్రోల్స్ కు గట్టిగానే జవాబిస్తుంటుంది అనసూయ. ఇకపోతే తాజాగా అనసూయ ఉమెన్స్ డేపై ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘ఓ! ప్రతి ట్రోలర్ , మీమ్ మేకర్స్ అందరూ ఈ రోజు మహిళలను గౌరవిస్తున్నారు. ఇది 24 గంటల్లోనే ముగుస్తుంది. సో మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. హా ఇంకేముంది దాంతో అనసూయపై ట్రోల్స్ తో నెటిజన్లు యుద్దం చేయడం మొదలు పెట్టారు. మనం ప్రవర్తించే తీరు ద్వారానే మనకు రెస్పెక్ట్ ఉంటుందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
తగ్గేదే లే అన్నట్టే అనసూయ కూడా ఆ కామెంట్లకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. గుమ్మడి కాయ దొంగలు వచ్చారు. నా ట్వీట్ కింద కామెంట్ చేస్తున్నారు మీరు కూడా చూడండి అంటూ ఇంకో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై కూడా అనసూయను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా.. అనసూయ ట్వీట్లు ఈ మధ్యన నెటిజన్లలో అసహనాన్ని నింపుతున్నాయనే చెప్పొచ్చు.
Share this content: