Assembly Election Results 2022: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన ట్రెండ్ ను చూపిస్తున్నాయి. అయితే, బీజేపీ ఆయా రాష్ట్రాల్లో దుమ్మురేపే ప్రదర్శన కనబరిచింది. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది.
ఇప్పటివరకు కొనసాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) కౌంటింగ్ వివరాలను గమనిస్తే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh election result 2022) లో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది బీజేపీ. మొత్తం 403 స్థానాల్లో బీజేపీ 271 స్థానాల్లో అధిక్యంలో ఉంది. సమాజ్ వాదీ పార్టీ 127 స్థానాల్లో, కాంగ్రెస్ 2, బీఎస్పీ 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఇక ఉత్తరాఖండ్ (uttarakhand election result 2022)లో బీజేపీ బీజేపీ 48, కాంగ్రెస్ 18, బీఎస్పీ 2, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. గోవాలోనూ (Goa election result 2022) బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 12, ఆప్ 3, టీఎంసీ 2 స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.
మణిపూర్ (Manipur election result 2022) లో మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ క్రాస్ చేసింది. ప్రస్తుతం 32 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. ఎన్‌పీపీ 8, జేడీయూ 6, కాంగ్రెస్ 4, ఇతరులు 10 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. పంజాబ్ (Punjab election result 2022) లో ఆప్ దుమ్మురేపింది. ఏకంగా 92 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 18, అకాలీదళ్ కూటమి 4, బీజేపీ కూటమి 2, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.