RRR : ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ !

RRR

ద‌ర్వాజ‌- సినిమా

RRR : సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “RRR”. మార్చి 25 న విడుదలకు సిద్ధంగా ఉన్న త‌రుణంలో ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విడుదలైన మొదటి 10 రోజులకు ఈ చిత్రానికి ప్రత్యేక టిక్కెట్ ధరలను త్వరలో నిర్ణయించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివ‌ర‌కు పేర్కొంది. “RRR” సినిమా టిక్కెట్ల కోసం ప్రత్యేక ధరలను అనుమతించాలని ద‌ర్శ‌కుడు రాజమౌళి చేసిన అభ్యర్థనను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ప్ర‌తి టికెట్ పై రూ.75 పెంచుకోవ‌చ్చున‌ని పేర్కొంది. సినిమా విడుద‌లైన 10 రోజులు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఈ విష‌యాల‌ను జిల్లా యంత్రాంగం ప‌ర్య‌వేక్షించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

Related Post