దర్వాజ-సినిమా
The Kashmir Files : ఇటీవల విడుదలైన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రంపై అక్షయ్ కుమార్, స్వర భాస్కర్, యామీ గౌతమ్ మరియు ఇతరులతో సహా పలువురు ప్రముఖులు తమ స్పందనలను పంచుకున్నారు. ప్రధాని మోడీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంత సర్వత్రా దీనిపై చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల తన 57వ పుట్టినరోజును జరుపుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan)మీడియాతో మాట్లాడుతూ.. చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రజలు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంటున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ గురించి వ్యాఖ్యానించమని మీడియా అమీర్ ను కోరగా.. “నిజానికి నేను కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడలేదు. కానీ అది చాలా విజయవంతమైందని నేను విన్నాను. టీమ్‌కి నా అభినందనలు” అని అన్నారు.
కాగా, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను 1990లలో జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీర్ పండిట్ల పై చోటుచేసుకున్న దారుణాలు, అకృత్యాల ఇతివృత్తంగా తెరకెక్కింది. వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహించగా.. ఇందులో నటీనటులుగా పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.