దర్వాజ-న్యూఢిల్లీ
Chilli prices soar: ఆసియా ఖండంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌లలో ఒకటైన వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత నెల రోజుల నుంచి ఎండు మిర్చి ధరలు రికార్డు ధర పలుకుతున్నాయి. ఎండుమిర్చి పంట క్వింటాల్‌కు రూ.48,000 వరకు ధర పలుకుతోంది. గతేడాది క్వింటాల్ ఎండు మిర్చి రూ.8 వేల నుంచి రూ.9 వేలు పలికింది. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.27 వేలతో సీజన్ ప్రారంభమైంది. ‘సింగిల్ పట్టి’ (single patti)రకం లేదా దేశీ రకానికి చాలా డిమాండ్ ఉంది.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అధిక ధర పెరగడానికి తెగుళ్లు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా తక్కువ దిగుబడి వచ్చిందని మార్కెట్‌లో ఉన్న రైతులు చెబుతున్నారు. ఎర్ర మిర్చి ఎక్కువగా ఇక్కడి నుంచి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు విదేశాలకు ఎగుమతి అవుతుంది.
రైతుల ముఖాల్లో ధర పెరిగిన ఆనందం కనిపించింది. పుల్లూరి మాధవరావు అనే రైతుకు మిర్చిపంటతో రికార్డు స్థాయిలో రూ.19.80 లక్షలు పొందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం కర్కపల్లికి చెందిన మరో రైతు క్వింటాల్‌కు రూ.45వేలు పలికింది. ఆయన 24 ఎండు మిర్చి బస్తాలను తీసుకొచ్చాడు.
“ఇది ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఆర్జించిన అత్యధిక సెస్సు” అని కార్యదర్శి బి వెంకటేష్ రాహుల్ తెలిపారు, “లక్ష్యం రూ. 28.30 కోట్లు అయితే, మాకు ఇప్పటివరకు రూ. 33.63 కోట్లు లక్ష్యాన్ని మించి వచ్చాయి. పూర్వ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో మా మార్కెట్ ఆదాయంలో టాప్ స్లాట్‌లో నిలిచిందని తెలిపారు.