Breaking
Tue. Nov 18th, 2025

Coronavirus: తెలంగాణలో కొత్తగా ఎన్ని క‌రోనా కేసులు నమోదయ్యాయంటే..?

corona new variant omicron
corona new variant omicron

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్‌

Coronavirus: దేశంలో క‌రోనా ప్రభావం కొన‌సాగుతూనే ఉంది. అయితే, కొత్త కేసులు త‌క్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. తెలంగాణ‌లో బుధ‌వారం నాడు కొత్త‌గా 72 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య 7,90,989కి చేరుకుంది. కొత్త‌గా మ‌ర‌ణాలు మాత్రం సంభ‌వించ‌లేదు. మొత్తంగా తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు.

క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. కోవిడ్‌-19 రికవరీ రేటు 99.39 శాతంగా ఉంది. కొత్త‌గా 50 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 7,86,241 కు పెరిగింది. కొత్త కేసుల్లో ఒక్క హైద‌రాబాద్ లోనే 35 కేసులు న‌మోద‌య్యాయి. ఈ రోజు అత్యధికంగా 22,072 నమూనాలను పరీక్షించారు. ప్ర‌స్తుతం 637 కోవిడ్‌-19 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కేసు మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.

Related Post