Breaking
Tue. Nov 18th, 2025

Lakhimpur Kheri: బ‌దిలీ చేయ‌డంతో.. బాలిక‌ల‌ను బంధించిన టీచ‌ర్లు !

Uttar Pradesh: Upset Over Transfer, 2 Teachers Lock Up Girl Students On UP School Roof
Uttar Pradesh: Upset Over Transfer, 2 Teachers Lock Up Girl Students On UP School Roof

ద‌ర్వాజ‌-ల‌క్నో
Uttar Pradesh: త‌మ‌ను ప్రాంతానికి బదిలీ చేశార‌న్న కోపంతో ఇద్ద‌రు టీచ‌ర్లు 24 మంది విద్యార్థినులను స్కూల్ పై గ‌దిలో బంధించారు. అర్థ‌రాత్రి వ‌ర‌కు బాలిక‌లు అక్క‌డే ఉండిపోయారు. ఈ ఘ‌ట‌న యూపీలోని ల‌ఖింపురి ఖేరి జిల్లాలో చోటుచేసుకుంది. త‌మ బ‌దిలీ ఉత్త‌ర్వుల‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినుల‌ను బంధించి.. అధికారుల‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ఘటన గత గురువారం చోటుచేసుకుంది. విద్యార్థినీలు హాస్ట‌ల్ తిరిగి రాక‌పోవ‌డంతో అక్క‌డి సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు బంధించబ‌డిన బాలిక‌ల‌ను సుర‌క్షితంగా హాస్టల్‌కు తీసుకువ‌చ్చారు.

లఖింపూర్ ఖేరి జిల్లాలోని బెహ్జామ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌నలో దాదాపు 24 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై లఖింపూర్ ఖేరిలోని విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే మాట్లాడుతూ.. ఇద్దరు ఉపాధ్యాయులు తమకు అందిన బ‌దిలీ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని ఒత్తిడిని అధికారుల‌పై తీసుకురావ‌డానికి ఇలా చేశార‌ని చెప్పారు. ఇప్పటికే వీరిపై పలు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే బదిలీ చేశామ‌ని తెలిపారు. బాలికల‌ను బంధించిన మనోరమా మిశ్రా, గోల్డీ కతియార్ అనే ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. పోలీసుల‌తో పాటు విద్యాశాఖ అధికారులు కూడా విచార‌ణ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న గురించి మొద‌టగా హాస్టల్ వార్డెన్ లలిత్ కుమారి.. లఖింపూర్ ఖేరి విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే, బాలికా విద్య జిల్లా కోఆర్డినేటర్ రేణు శ్రీవాస్తవ్‌లకు సమాచారం అందించారు. వారు పాఠశాలకు చేరుకుని బాలిక‌ల‌ను సుర‌క్షితంగా హాస్టల్ కు చేర్చారు.

Related Post