Xiaomi India: షియోమీకి ఈడీ షాక్‌.. రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్‌

Xiaomi India
Xiaomi India

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Xiaomi India: భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో మార్కెట్ లీడర్ గా కొన‌సాగుతున్న Xiaomi ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. జియోమీ టెక్నాల‌జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తుల‌ను సీజ్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో షియోమీ, ఇతర చైనా మొబైల్ కంపెనీల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ క్ర‌మంలోనే కీలక ప‌త్రాలు స్వాధీనం చేసుకుంది. విదేశీ మార‌కంలో ఆ కంపెనీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించిన ఈడీ.. స‌ద‌రు కంపెనీ ఆస్తుల‌ను సీజ్ చేసింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ ఇండియాకు చెందిన‌ రూ. 5,551.27 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. చెల్లింపులకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది.

“ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-1999 నిబంధనల ప్రకారం కంపెనీ చేసిన అక్రమ బాహ్య చెల్లింపులకు సంబంధించి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.5551.27 కోట్ల M/s Xiaomi టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది” అని Enforcement Directorate ట్విట్ట‌ర్ లో వెల్లడించింది.

Related Post