Breaking
Tue. Nov 18th, 2025

Patiala clash: పాటియాలాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు.. ఇంటర్నెట్ షట్డౌన్

Patiala clash: Clashes between two groups in Patiala .. Internet shutdown

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
Patiala clash: పంజాబ్ లోఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఓ రైట్ వింగ్ సంస్థ సభ్యులు పాటియాలలో శుక్రవారం తీసిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పంజాబ్‌లోని పాటియాలాలో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా అధికారులు శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను కూడా ప్ర‌భుత్వం బదిలీ చేసింది.

ప‌టియాలా ఘ‌ర్ష‌ణ‌లపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఇందులో భాగ‌మైన వారిని హెచ్చరించారు. ఈరోజు జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ.. పంజాబ్ శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. కర్ఫ్యూ విధించిన తరువాత పాటియాలాలో శాంతి నెలకొందని అన్నారు. నిన్నటి సంఘటన తర్వాత పోలీసు అధికారులను బదిలీ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మరియు సమస్య పరిష్కారానికి శాంతి కమిటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని తెలిపారు.

Related Post