Breaking
Tue. Nov 18th, 2025

LPG price hike: పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధ‌ర.. ఎంత పెర‌గిందంటే.. ?

Liquefied petroleum gas cylinderprice-increased by rs 102.50

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
LPG cylinder price increased: ఎల్‌పీజీ గ్యాస్ ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఆదివారం రూ.102.50 పెరిగింది. గతంలో రూ.2,253గా ఉన్నసిలిండ‌ర్ ధర ఇప్పుడు రూ.2,355.50కు పెరిగింది. 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.655గా ఉంది. అంతకుముందు ఏప్రిల్ 1వ తేదీన 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌కు రూ.250 చొప్పున పెంచారు. దీంతో ఇప్పుడు 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ ధర రూ.2,253 అవుతుంది. వాణిజ్య LPG ధర గతంలో మార్చి 1న రూ.105 పెరిగింది. మ‌ళ్లీ ఇప్పుడు వంద రూపాయ‌ల‌కు పైగా పెరిగింది.

ఇదిలా ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లతో కూడిన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉజ్వల దివస్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ LPG panchayats లను ఈరోజు నిర్వహించబోతున్నాయి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సురక్షితమైన, నిరంతర వినియోగాన్ని లక్ష్యంగా చేసుకుని వారి వారి అనుభ‌వాల‌ను పంచుకోవ‌డంతో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలు వినియోగ‌దారుల‌ను పెంచుకోవ‌డానికి ఈ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాయి.

Related Post