Breaking
Tue. Nov 18th, 2025

Parliament: పార్ల‌మెంట్ లో పోర్న్ వీడియోలు చూసిన ఎంపీ

British Lawmaker: British Mp Resign After Being Caught Watching Porn in Parliament

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం
British Lawmaker : స‌మావేశాలు జ‌రుగుతుండ‌గా ఓ పార్ల‌మెంట్ స‌భ్యులు పోర్న్ వీడియోలు చూశారు. బ్రిట‌న్ పార్ల‌మెంట్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బ్రిట‌న్ లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కి చెందిన స‌భ్యుడు నీల్ పారిష్ హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలు జరుగుతున్నప్పుడు పోర్న్ వీడియోలు చూశాడు. ఆయ‌న తీరుపై ప్ర‌తిప‌క్షాల‌తో పాటు సొంత‌పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

కాగా, ఆయ‌న ప‌క్క సీట్ లో కూర్చున్న మ‌హిళా స‌భ్యురాలు.. నీల్ పారిష్ పోర్న్ వీడియోలు చూస్తున్న విష‌యాన్ని స్పీక‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై మాట్లాడిన నీల్ పారిష్‌.. తన తోటి చట్టసభ సభ్యులు ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహిస్తున్నప్పుడు తాను రెండుసార్లు అశ్లీల చిత్రాలను చూశానని చెప్పిన‌ట్టు బీబీసీ నివేదించింది. మొద‌టి సంద‌ర్భంలో వ్యవసాయ పరికరాల కోసం వెబ్‌లో శోధిస్తున్నప్పుడు అనుకోకుండా తన సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోను క్లిక్ చేసినట్లు పారిష్ పేర్కొన్నాడు.

Related Post