Breaking
Tue. Nov 18th, 2025

Telangana: అంబులెన్సులో ఆవులు స‌జీవ ద‌హ‌నం.. అక్ర‌మ ర‌వాణ అంటూ బీజేపీ ఆగ్ర‌హం !

Nizamabad cattle accident

దర్వాజ-హైద‌రాబాద్‌
Nizamabad cattle accident: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి అంబులెన్స్‌ను పోలిన వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులు స‌హా వాహనం దగ్ధమై కాలిపోయాయి. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా 44వ నెంబరు జాతీయ రహదారిపై రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ ప్రమాదానికి గురైన వాహ‌నంలోని జంతువులు ఆవుల‌నీ, వాటిని కబేళాకు తరలిస్తున్నారని ఆరోపించారు.

“నిన్న రాత్రి, నిజామాబాద్ నుండి హైదరాబాద్‌కు ‘అంబులెన్స్’లో 10 ఆవులను స్లాటర్‌హౌస్‌కు తరలించారు, అంబులెన్స్‌లో 8 ఆవులు సజీవ దహనమయ్యాయి. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. @TelanganaDGP తక్షణమే దీని వెనుక ఉన్న వ్యక్తులపై చర్య తీసుకోవాలి’ అని గోషామల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ ఆదివారం ట్వీట్ చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై Nizamabad Commissioner of Police K R Nagaraj మీడియాతో మాట్లాడుతూ.. రవాణా చేస్తున్న జంతువులు 13 ఎద్దులని, అదే విషయాన్ని నిర్ధారించడానికి వెటర్నరీ డాక్టర్ కాలిపోయిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంద‌ని తెలిపారు. అది స‌రైన అంబులెన్స్ వాహనం కాదనీ, ఇది సైరన్‌ని ఉంచడం ద్వారా అంబులెన్స్‌గా మార్చబడిన టెంపో అని చెప్పారు. విచారణ నిమిత్తం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

Related Post