Breaking
Sat. Jun 28th, 2025

Putin Cancer Surgery : రష్యా అధ్యక్షుడు పుతిన్ కు క్యాన్స‌ర్‌.. నికోలాయ్ పట్రుషేవ్‌కు అధికారాలు అప్ప‌గింత.. !

Putin Cancer Surgery : Putin To Undergo Cancer Treatment, Hand Over Power, Claims US Media Report

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

Putin Cancer Surgery : ఇటీవలి వారాల్లో రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి గత నెలలో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన సమావేశంలో డెస్క్‌ను గట్టిగా పట్టుకోవడం కనిపించిన తర్వాత ఆయ‌న ఆరోగ్యం పై అనుమానాలు పెరిగాయి. ఈ నేప‌థ్యంలోనే అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్ట్ సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొంది. ఆయ‌న క్యాన్స‌ర్ స‌ర్జ‌రీ చేయించుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని బ్రిట‌న్ మీడియా కూడా పేర్కొంది. శస్త్రచికిత్స తర్వాత పుతిన్‌ స్పృహలోకి రావడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం లేకపోలేదు. సర్జరీ తర్వాత ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటారో కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. అప్పటివరకు దేశరక్షణ బాధ్యతలను నికోలాయ్ పట్రుషేవ్‌కు చూసుకుంటార‌ని స‌మాచారం. అయితే సర్జరీ వెళ్తున్న పుతిన్‌ తన అధికారాలను పూర్తిస్థాయిలో బదిలీ చేసేందుకు ఇష్టపడటం లేదనీ, అందుకే స‌ర్జ‌రీని వాయిదా వేస్తూ వ‌చ్చార‌ని బ్రిటన్‌ మీడియా తెలిపింది.

న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించింది. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. త్వరలోనే సర్జరీ చేయించుకోవ‌డాఇకి వెళ్తున్నార‌నీ, ఈ నేపథ్యంలో దేశ రక్షణతో పాటు ఉక్రెయిన్‌ యుద్ధ తాత్కాలిక బాధ్యతలను మాజీ ఎఫ్‌ఎస్‌బీ చీఫ్‌ నికోలాయ్ పట్రుషేవ్‌కు అప్పగిస్తారని న్యూయార్క్ పోస్ట్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. కాగా, 70 ఏండ్ల నికోలాయ్ పట్రుషేవ్‌కు.. రష్యా భద్రత మండలిలో ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. ఉక్రెయిన్‌ పై యుద్ధ ప్రణాళికలను రచించిన ముఖ్యుల్లో ఈయన కూడా ఒకరు. రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ లెఫ్టినెంట్ నడుపుతున్న టెలిగ్రామ్ ఛానెల్‌ని ఉటంకిస్తూ ఈ వివ‌రాల‌ను యుఎస్ మీడియా నివేదించింది. పుతిన్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపాయి. అంతకుముందు, పుతిన్ ఓ బ‌హిరంగా స‌మావేశంలో త‌న శ‌రీర ప్ర‌వ‌ర్త‌న‌ను ప్ర‌స్తావిస్తూ.. ఆయ‌న అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అమెరికన్ మీడియా పేర్కొంది.

అయితే, పెంటగాన్ ఈ వార్తలను ధృవీకరించలేదు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. కాగా, ఇటీవ‌లే పుతిన్ నికోలాయ్ పట్రుషేవ్ తో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఇది పుతిన్ ఆరోగ్యం గురించే అని న్యూయార్క్ పోస్ట్ క‌థ‌నం పేర్కొంది. “పుతిన్ నికోలాయ్‌ను ప్రభుత్వంలో అత్యంత విశ్వసనీయ సభ్యునిగా చూస్తాడు. తన ఆరోగ్యం క్షీణిస్తే దేశ నియంత్రణను తాత్కాలికంగా నికోలాయ్ పట్రుషేవ్‌కు అప్పగిస్తానని అధ్యక్షుడు చెప్పారు. ‘పుతిన్ కంటే నికోలాయ్ పట్రుషేవ్‌కు చాలా ప్రమాదకరమైనవాడు. మరింత వ్యూహాత్మకమైన.. పుతిన్ కంటే మోసగాడు ”అని క్రిస్టియన్ సైన్స్ మానిటర్ వాషింగ్టన్ బ్యూరో చీఫ్ డేవిడ్ కుక్ అన్నారు. రెండు మూడు రోజుల్లో రష్యా నియంత్రణ నికోలాయ్ పట్రుషేవ్‌ చేతుల్లోకి వస్తుందని టెలిగ్రామ్ ఛానెల్ అంచనా వేసింది.

Related Post