Loading Now
India, Covid-19, Coronavirus, క‌రోనా వైర‌స్, కోవిడ్-19, భార‌త్,

Coronavirus : క‌రోనా ఉప్పెన‌తో 5,23,975 మంది మృతి..

దర్వాజ-హైద‌రాబాద్

Coronavirus disease: భార‌త్ లోనూ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా వైర‌స్ కొత్త కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్ర‌భావం పెరుగుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గురువారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో కొత్త‌గా 3,275 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ.. 55 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య 5,23,975కు పెరిగింది. క‌రోనా వైర‌స్ మొత్తం కేసుల సంఖ్య 4,30,91,393 కు చేరుకుంది.

భార‌త్ క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర టాప్ ఉంది. ఆ త‌ర్వాతి స్థానంలో కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లు ఉన్నాయి. ప్ర‌స్తుతం భార‌త్ లో 19,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి నుచి 3,010 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా రిక‌వ‌రీల సంఖ్య 4,25,47,699కు చేరుకుంది. ఇదిలావుండగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 189.6 కోట్ల క‌రోనా టీకా డోసులు పంపిణీ చేశారు. ఇందులో ఫ‌స్ట్ డోసుల సంఖ్య 91.5 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న‌వారి సంఖ్య 81.3 కోట్లుగా ఉంది.

అన్ని దేశాల్లో క‌లిపి క‌రోనాతో 6,269,587 మంది మృతి

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 6,269,587 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. మొత్తం 515,354,713 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, యూకే, ర‌ష్యా, సౌత్ కొరియా, ఇట‌లీ, ట‌ర్కీ, స్పెయిన్ లు ఉన్నాయి.

Share this content:

You May Have Missed