Breaking
Wed. Nov 19th, 2025

Andhra Pradesh: ఆరేండ్ల బాలిక‌పై అత్యాచారం.. !

Andhra Pradesh, Six-Year-old girl, raped, Anakapalli, POCSO Act, Police, hospital, girl ,rape case , ఆంధ్రప్రదేశ్, ఆరేళ్ల బాలిక, అత్యాచారం, లైంగిక‌దాడి, అన‌కాపల్లి, పోక్సో చట్టం, పోలీసులు, ఆస్పత్రి, బాలిక, అత్యాచారం కేసు ,

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి

Six-Year-old girl raped: ఆంధ్రప్ర‌దేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆరేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండ‌గుడు ఆపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. అనకాపల్లి జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పొరుగింటి సాయి అనే వ్యక్తి తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. నిందితులు బాలికను పొదల్లోకి తీసుకెళ్లారని, కిడ్నాప్‌పై బాధితురాలి సోదరి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెత‌క‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. అనంతరం తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేసును ఏఎస్పీ మణికంఠ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Related Post