Breaking
Tue. Nov 18th, 2025

RRB NTPC Special Trains: RRB పరీక్ష అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు !

Andhra Pradesh, RRB , RRB exam , RRB exam candidates, Special trains, ఆంధ్రప్రదేశ్, ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌బీ పరీక్ష , ఆర్ఆర్‌బీ పరీక్ష అభ్యర్థులు, ప్రత్యేక రైళ్లు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, రైళ్లు ,

దర్వాజ-హైదరాబాద్

RRB NTPC Special Trains : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పరీక్షల అభ్యర్థుల కోసం భార‌తీయ‌ రైల్యే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నుంది. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన పరీక్ష కోసం 65 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. సాంకేతికేతర విభాగాల్లోని పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (ఆర్‌ఆర్‌బీ) నిర్వ‌హిస్తున్న‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 65 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వేవిడుద‌ల చేసింది. ఏయే మార్గాల్లో రైళ్లు నడుస్తాయో, బయల్దేరే వేళలు, ఏయే స్టేషన్లలో ఆగుతాయి వంటి వివరాలను జాబితాలో పేర్కొన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది.

హైదరాబాద్‌- మైసూర్‌, సికింద్రాబాద్‌- విశాఖ, జబల్పూర్‌- నాందేడ్‌, గుంటూరు- నాగర్‌సోల్‌, హతియా-చీరాల, నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్- మైసూర్‌, కాకినాడ పట్టణం- కర్నూలు నగరం, ఆదిలాబాద్‌- చెన్నై సెంట్రల్‌, హుబ్బళి- ఔరంగాబాద్‌, డోన్‌- విజయవాడ, మచిలీపట్నం- ఎర్నాకుళం, కడప- విశాఖ, చీరాల-షాలిమార్‌ , హటియా-విజయవాడ, నర్సాపురం-త్రివేండ్రం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఎన్టీపీసీ ఉద్యోగార్థుల కోసం నడిపే 65 ప్రత్యేక రైళ్లలో ఎలాంటి రాయితీలు ఉండవని, ప్రత్యేక రైళ్ల రుసుమును చెల్లించాలని అధికారులు తెలిపారు.

Related Post