Breaking
Tue. Nov 18th, 2025

honour killing: తెలంగాణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

honour killing, NHRC , Telangana , Hyderabad , inter-caste, inter-religion marriage, National Human Rights Commission, పరువు హత్య, ఎన్‌హెచ్చార్సీ, తెలంగాణ , హైదరాబాద్ , కులాంతర వివాహం, మతాంతర వివాహం, జాతీయ మానవ హక్కుల కమిషన్,

దర్వాజ-హైదరాబాద్

Hyderabad honour killing : హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పరువు హత్యకు సంబంధించి జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ తెలంగాణ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. స‌రూర్ న‌గ‌ర్ లో 25 ఏండ్ల యువకుడిని అతని భార్య సోదరుడు మరియు మరొక వ్యక్తి హత్య చేసిన ఘటనపై పూర్తి నివేదిక‌ను అందించాల‌ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) ఆదేశించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. కులాంతర లేదా మతాంతర వివాహాల కేసుల్లో పరువు హత్యలు జరగకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా విధానం ఉందా లేదా అనే నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది.

ఈ కేసులో ప్రస్తుత దర్యాప్తు ప‌రిస్థితి, బాధితుడి భార్య మరియు అతని కుటుంబ సభ్యులను రక్షించడానికి తీసుకున్న చర్యలు, వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏదైనా సహాయం గురించి తెలియజేయాలని DGPని కోరింది. కాగా, ఈ నెల 4వ తేదీన రాత్రి సరూర్ నగర్ లో నాగారాజును అతని భార్య సోదరులు హత్య చేశారు. మతాంతర వివాహం చేసుకొన్నందుకు కక్షగట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.

Related Post