Breaking
Tue. Nov 18th, 2025

Telangana: ‘ఆస్క్ కేటీఆర్’ అంటూ నెటిజ‌న్ల‌లో ముచ్చ‌టించిన తెలంగాణ మంత్రి !

darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, KTR, CMDA, suspend, birthday memo, Bellampalli Municipal Council, Telangana, కేటీఆర్, సీఎండీఏ, పుట్టినరోజు మెమో, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్, తెలంగాణ,కేసీఆర్‌,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు నెటిజన్లు పాల్గొని పలు ప్రశ్నలు సంధిస్తూ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సమస్యలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొంతమంది నెటిజన్లు అనేక ప్రశ్నలను అడిగారు, వాటిలో కొన్ని రాజకీయాలు, కొన్ని అభివృద్ధి సంబంధించిన‌వి, మ‌రికొన్ని విద్య వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన‌వి ఉన్నాయి. మరికొన్ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని సంబంధించిన‌వి ఉన్నాయి.

తెలంగాణలోని విద్యాసంస్థలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐడి లేదా ఐఐఐటి వంటి ఏ ఒక్క జాతీయ విద్యా సంస్థను మంజూరు చేయలేదని అన్నారు. మేము 8 సంవత్సరాలుగా వీటికి సంబంధించి అభ్యర్థిస్తున్నాము.. కానీ కేంద్రం వివ‌క్ష‌ను చూపింద‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధితో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

Related Post