దర్వాజ-న్యూఢిల్లీ
demolition drive-Delhi : దేశ రాజధాని ఢిల్లీ విధుల్లో బుల్డోజర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. వివరాల్లోకెళ్తే.. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ, మంగోల్‌పురిలో అక్రమ కట్టడాలను అధికారులు తొలగింపు చర్యలు ప్రారంభించారు. షాహీన్ బాగ్‌లో కూల్చివేత డ్రైవ్ జరిగిన ఒక రోజు తర్వాత, భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లు ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఇక అక్రమ నిర్మాణాల కూల్చివేత నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ప్రజలు కూల్చివేతకు అడ్డుపడ్డారు. వెనక్కితగ్గని అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. దక్షిణ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కూల్చివేత డ్రైవ్ కొనసాగిస్తున్నారు.
Visuals of security personnel from Delhi’s New Friends Colony where the South Delhi Municipal Corporation (SDMC) plans to carry out a demolition drive
— ANI (@ANI) May 10, 2022
SDMC is carrying out the first phase of the demolition drive from May 4 to May 13 in several parts of South Delhi pic.twitter.com/4WknzDrbMh
మే 4న ప్రారంభమైన ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే కూల్చివేత కార్యక్రమాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్‌ను కూడా మంగోల్‌పురిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణల నిరోధక డ్రైవ్‌పై ఢిల్లీ డీసీపీ సమీర్ శర్మ మాట్లాడుతూ.. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.. ప్రజలు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
#WATCH Bulldozer being brought to New Friends Colony area of Delhi where the South Delhi Municipal Corporation is set to carry out an anti-encroachment drive pic.twitter.com/3PorPPiao3
— ANI (@ANI) May 10, 2022
