Breaking
Tue. Nov 18th, 2025

Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కు వింత వ్యాధి..

Xi Jinping , traditional Chinese medicines, surgery, blood vessels, shrinks aneurysm, Cerebral Aneurysm, china, Chinese President Xi Jinping,

దర్వాజ-అంతర్జాతీయం

Chinese President Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఓ వింత వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ నివేదిక‌ల వివ‌రాల ప్ర‌కారం.. జిన్‌పింగ్ మెద‌డు సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న‌ ‘సెరిబ్రల్ అనూరిజం’తో బాధపడుతున్నారు. దీనిని చాలా కాలం క్రిత‌మే గుర్తించార‌నీ, 2021 చివరిలో ఆసుపత్రిలో చేరాల్సి ఉండింద‌ని మీడియా నివేదికలు తెలిపాయి. రుక్తనాళాలను మృదువుగా చేసి, రక్తనాళాన్ని కుదించేలా చేసే శస్త్రచికిత్సలకు వెళ్లడం కంటే చైనా సంప్రదాయ ఔషధాలతో చికిత్స చేయించుకోవడానికే ఆయన ఇష్టపడినట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ఆయ‌న సంప్రదాయ చైనా వైద్యం తీసుకుంటున్నారు.

కాగా, దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ప్ప‌టి నుంచి తాజా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ నాయకులను ఆయ‌న అనారోగ్యం కార‌ణంగానే క‌ల‌వ‌లేద‌ని రిపోర్టుల స‌మాచారం. 2019లో ఇట‌లీ ప‌ర్య‌ట‌న‌, 2020లో షాంఘైలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న క్ర‌మంలోనే ఆయ‌న ఉన్న తీరుతో.. జిన్‌పింగ్ ఆరోగ్యంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

Related Post