Breaking
Tue. Nov 18th, 2025

UAE: యూఏఈ కొత్త అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జాయెద్

Sheikh Mohamed Bin Zayed, UAE President, UAE , United Arab Emirates, Khalifa bin Zayed Al Nahyan, India , Abu Dhabi,

దర్వాజ-అంతర్జాతీయం

UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొత్త అధ్యక్షుడిగా షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఆ దేశ సుప్రీం కౌన్సిల్ ప్రకటించింది. అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటించారు. షేక్ మొహమ్మద్ ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడ్డారని ఆ దేశ మీడియా పేర్కొంది. మాజీ అధ్య‌క్షుడి సోదరుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ (61) దేశానికి మూడో అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. ఆయన 2004 నుంచి అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌గా పని చేసిన షేక్‌ మొహమ్మద్‌ అబుదాబికి 17వ పాలకుడిగా పని చేయనున్నారు.

Related Post