Breaking
Tue. Nov 18th, 2025

Navjot Sidhu: మాజీ క్రికెట‌ర్‌, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

Navjot Singh Sidhu
Navjot Singh Sidhu

దర్వాజ-న్యూఢిల్లీ

Congress Leader Navjot Sidhu: 34 ఏళ్ల నాటి ఓ కేసులో భార‌త మాజీ క్రికెట‌ర్‌, కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 58 ఏళ్ల నవజ్యోత్ సిద్ధూ ఒక సంవత్సరం కఠినమైన జైలు శిక్ష అనుభవించడానికి కోర్టు ముందు లొంగిపోవాలి అని పేర్కొంది. 1988 డిసెంబర్ 27న సిద్ధూ ఒక వాగ్వాదం సమయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే సిద్ధూపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద హత్యానేరం కాకుండా నేరపూరిత నరహత్య విధించాలన్న అభ్యర్ధనను న్యాయమూర్తులు జస్టిస్ ఏం ఖాన్విల్కర్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. 2018లో ఈ నేరానికి గాను సిద్ధూను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

Related Post