Breaking
Tue. Nov 18th, 2025

Japanese man: ఔరా ఎంత విచిత్రం.. ! మనిషి కుక్క‌లా మారాడు !

Japanese man pays whopping Rs 12 lakh to turn into a dog, watch viral transformation video

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం
viral video: కుక్కలా ప్రశాంతంగా జీవించాలని మీరు ఎప్పుడైనా కలలుగన్నారా? కానీ జపాన్‌లోని ఓ వ్యక్తి కుక్క మార‌ల‌నుకున్నాడు.. అలాగే, జీవించాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి కుక్క‌ల మారి త‌న క‌ల‌ను నిజం చేసుకున్నారు. మీకు ఇది విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం.. జ‌పాన్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

వివ‌రాల్లోకెళ్తే.. జ‌పాన్ లోని ఒక వ్య‌క్తి కుక్క‌లా జీవించాల‌నుకున్నారు. దీని కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి అచ్చం కుక్క‌లానే మారిపోయాడు. జ‌ప‌నీస్ మీడియా పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. ఒక వ్య‌క్తి కుక్కాల క‌నిపించాల‌ని జెప్పెట్ సంస్థ‌ను ఆశ్ర‌యించాడు. జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం పెద్దఎత్తున శిల్పాలను తయారు చేస్తోంది. అద్భుత కళాఖండాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా రూపొందిస్తోంది.

దీంతో కుక్క‌లా క‌నిపంచాల‌ని అనుకున్న టోకో ఇవీ అనే వ్యక్తి జెప్పెట్ ఈ విష‌యం గురించి చెప్పాడు. ఎంత ఖర్చు అయినా భరిస్తాను అని చెప్పడంతో ఇందుకు ఆ సంస్థ అంగీకరించింది. సంస్థ 40 రోజుల పాటు కష్టపడి టోకో ఇవీని కోలీ జాతి శునకంలా మార్చారు. మేకప్, ఇతరత్రా ఖర్చులకోసం ఇవీకి 2 మిలియన్ యెన్ లు (దాదాపు రూ. 12 లక్షలు) ఖర్చయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో, వీడియో యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్నాడు టోకో ఇవీ. అయితే ఎన్ని రోజుల పాటు ఇలా ఉంటాను అనే విషయం మాత్రం వెల్లడించ‌లేదు. ఈ విష‌యం తెల‌సుకున్న వారు ఔరా మ‌నిషి ఎంత విచిత్ర‌మైన వాడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Related Post