Breaking
Tue. Nov 18th, 2025

Tsunami: హిందూ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు.. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌పంచ దేశాలు

Tsunami • Earthquake • Indian Ocean • Timor-Leste • Timor • India

దర్వాజ-అంతర్జాతీయం

Indian Ocean: తూర్పు తైమూర్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. లోస్పాలోస్ అనే ప్రదేశానికి ఈశాన్యంగా 38 కిలోమీట‌ర్ల దూరంలో.. 49 కిలోమీటర్ లోతులో భూకంపం కేంద్రం కేంద్రీకృత‌మైంద‌ని అమెరికాకు చెందిన యూఎస్‌జీఎస్ తెలిపింది. అయితే, భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ‌నష్టం సంభ‌వించ‌లేదు. కానీ ఈ భూకంపం కారణంగా హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చే అవకాశం ఉందని యూఎస్ సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూట్ యూఎస్‌జీఎస్ హెచ్చ‌రించింది. దీంతో హిందూ మ‌హాస‌ముద్ర తీర దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.

కాగా, ఈ ప్రాంతంలో 2004లో అత్యంత భయంకరమైన భూకంపం కాణంగా ల‌క్ష‌లాది మంది చ‌నిపోయారు. స‌మత్రా తీరాన్ని తాకిన ప్రమాదకరమైన 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఏర్పడిన సునామీతో ఇండోనేషియాలో 1.70 లక్షల మందితో పాటు తైమూర్‌లో మొత్తం 2.20 లక్షల మంది మరణించారు.

Related Post